Breaking News

సీమకు ఇం‘ధనం’

Published on Wed, 01/31/2024 - 04:00

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భారీ పెట్టుబడు­లకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్ష­తన మంగళవారం క్యాంపు కార్యాలయంలో  సమావేశమైన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డు) ఆమోద ముద్ర వేసింది. ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో ఇంధన రంగంలో భారీ పెట్టుబడులు తరలిరానున్నాయి. ఇంధన రంగంలో పలు ప్రాజెక్టుల ద్వారా రూ.22,302 కోట్ల పెట్టుబడులకు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది. తద్వారా ప్రత్యక్షంగా 5,300 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. 

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులివీ
► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ దాదాపు రూ.12,065 కోట్ల పెట్టుబడితో రాష్ట్రంలో 3,350 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టులను నెలకొల్పనుంది. వైఎస్సార్‌ జిల్లా చక్రాయపేట వద్ద 400 మెగావాట్లు, శ్రీసత్యసాయి జిల్లా ముదిగుబ్బవద్ద 1,050 మెగావాట్లు, అనంతపురం జిల్లా కనగానపల్లె, రాప్తాడుల్లో 1,050 మెగా­వాట్లు, అనంతపురం జిల్లాలో డి.హీరే­హాల్, బొమ్మనహాళ్‌లో 850 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్లను ఏర్పాటు చేయనుంది. ప్లాంట్ల ఏర్పాటు ద్వారా 3,300 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 

► జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌ నంద్యాల జిల్లా అవుకు మండలం కునుకుంట్ల, కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం జలదుర్గం వద్ద రెండు విండ్‌ పవర్‌ ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది. రూ.1,287 కోట్ల పెట్టుబడితో 171.60 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్టులు సాకారం కావడం ద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 

► శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం పులిగుండ్లపల్లెలో 1,000 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్ట్‌ను ఆక్వా గ్రీన్‌ ఇంజనీరింగ్‌ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.4,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. తద్వారా 1,000 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు దక్కుతాయి.

4. కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద 200 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌ను ఎక్రోన్‌ ఎనర్జీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.1350 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. దీనిద్వారా 200 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు వస్తాయి.

5. శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లో 600 మెగావాట్ల విండ్‌ పవర్‌ ప్రాజెక్ట్‌లను రెన్యూ విక్రం శక్తి ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.3,600 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. తద్వారా 600 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగాలు లభించనున్నాయి. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు..
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ) బూడి ముత్యాలనాయుడు, ఆర్ధిక, ప్రణాళిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, విద్యుత్, అటవీ, పర్యావరణ, భూగర్భ గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పరిశ్రమలు, ఐటీ, పెట్టుబడుల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె.ప్రవీణ్‌ కుమార్, పరిశ్రమలశాఖ కార్యదర్శి ఎన్‌.యువరాజ్, పరిశ్రమలు, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి (హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్టŠస్‌టైల్స్‌) కె.సునీత, రవాణాశాఖ కార్యదర్శి ప్రద్యుమ్న, పరిశ్రమలశాఖ కమిషనర్‌ సీహెచ్‌ రాజేశ్వర్‌రెడ్డి, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ, ఎండీ ఎస్‌ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)