Breaking News

స్టాక్స్‌లో పెట్టుబడి పేరుతో రూ.5.25 కోట్ల మోసం

Published on Fri, 09/05/2025 - 05:21

విశాఖపట్నం: స్టాక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన ముగ్గురు నిందితులను విశాఖ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకానగర్‌కు చెందిన ఒక వ్యక్తిని సైబర్‌ నేరగాళ్లు వాట్సాప్‌ ద్వారా సంప్రదించారు. స్టాక్‌ మార్కెట్‌లో పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని నమ్మించి రూ.5.25 కోట్లు దోచుకున్నారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

పోగొట్టుకున్న డబ్బులో రూ.27 లక్షలను బాధితుడు రాజస్థాన్‌లో ఉదయ్‌పూర్‌కి చెందిన వ్యక్తి ఐడీఎఫ్‌సీ బ్యాంక్‌ ఖాతాకు ఆర్‌టీజీఎస్‌ ద్వారా బదిలీ చేశారు. ఆ డబ్బు పలు ఖాతాల్లోకి మళ్లించినట్లు గుర్తించారు. వీటిలో కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన పాసుల వేణు, మామిడిపల్లి విజయ్‌ ఖాతాలు ఉన్నట్లు తేల్చారు.

దీనితో ఒక ప్రత్యేక పోలీసు బృందం కరీంనగర్‌కు వెళ్లి విచారణ చేపట్టింది. వేణు బ్యాంక్‌ ఖాతా ద్వారా జగిత్యాలకు చెందిన దుర్గం గోపీకృష్ణ సైబర్‌ నేరగాళ్లకు డబ్బు పంపుతున్నట్లు తేలింది. అక్రమ లావాదేవీల్లో అమెరికా డాలర్, క్రిప్టో కరెన్సీలను కూడా వినియోగించడం గమనార్హం. ఈ ఘటనలో వేణు, గోపీకృష్ణలతోపాటు నర్మెట్ట జీవ అనే మరో సైబర్‌ నేరస్తుడు అరెస్ట్‌ అయ్యాడు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)