Breaking News

ప్రత్తిపాడు సర్కిల్‌ అ‘ధర’హో

Published on Fri, 08/30/2024 - 04:08

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ జిల్లాలో ‘త్రీ స్టార్‌’ రేటింగ్‌ అదిరిపోయింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ వేలం వేసి మరీ పోస్టులు ఖాయం చేశారు. ఇటీవల కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో ఓ సర్కిల్‌ పోస్టు అర కోటికి ఖరారు కాగా.., ఇప్పుడు ప్రత్తిపాడు సర్కిల్‌ రూ. 30 లక్షలకు బేరం కుదిరినట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో మెట్ట ప్రాంతంలో ప్రత్తిపాడు సర్కిల్‌ హాట్‌ సీటు. 

ఈ సర్కిల్‌ కోసం కొందరు ‘త్రీ స్టార్‌’లు ఓ నాయకుడి చుట్టూ నెల రోజులుగా తిరగ్గా.. గురువారం పోస్టు భర్తీ అయ్యింది. ప్రత్తిపాడుతో పాటు తుని, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియో­జ­కవర్గాల్లో త్రీ స్టార్‌ రేటింగ్‌ అదిరిపోయింది. గతంలో ఎప్పుడూ ఇలాంటి సంస్కృతి చూడలేదని పోలీసులే విస్తుబోతున్నారు.

సర్వం షాడో ఎమ్మెల్యేనే..
ఇటీవలి ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీకి అన్నీ తానై వ్యవహరించి, ఇప్పుడు ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న నాయకుడే పోలీసు బదిలీలు అన్నింటినీ ఫైనల్‌ చేస్తున్నారు. ఇటీవల కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని ఒక సర్కిల్‌ పోస్టును రూ.అర కోటికి ఖాయం చేశారు. 

ఈ పోస్టు కోసం ఇద్దరు ముగ్గురి మధ్య పోటీ తీవ్రంగా నడిచింది. చివరకు తన సర్వీసులో ఎక్కువ కాలం కాకినాడలోనే పనిచేసిన ఓ ‘త్రీ స్టార్‌’ అడిగినంతా ఇచ్చుకుని పోస్టు ఎగరేసుకుని పోయారు. ఇప్పుడు ప్రత్తిపాడుకు రూ. 10 లక్షల నుంచి మొదలై రూ.30 లక్షలకు ఖరారైంది. 

అందుకే అంత ధర!
నాలుగు స్టేషన్లు ఉన్న ప్రత్తిపాడు సర్కిల్‌ అధికా­రులకు ఆయిల్‌ మాఫియా నుంచి నెల నెలా రూ.లక్షల్లో రాబడి వస్తుంది. మిగతా ఆదాయమూ పెద్దగానే ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో ఎస్‌ఐగా పనిచేస్తూ కల్తీ ఆయిల్‌ వ్యవహారంలో రూ.లక్షలు లంచం తీసుకొని ట్యాంకర్‌ను వదిలేసి, సస్పెండైన ఓ పోలీసు అధికారి, గుప్త నిధుల వ్యవహారంలో దొంగ సొమ్మునే దోచేసి చివరకు అసలు నిందితుడు పట్టుబడడంతో 2020లో సస్పెండైన మరో అధికారి కూడా ప్రత్తిపాడు కోసం ప్రయత్నించారు. ఇక కాకినాడ సిటీ నియోజకవర్గంలో మూడు,  రూరల్‌లో రెండు, పెద్దాపురం నియోజకవర్గంలో ఒక సర్కిల్‌ పోస్టుకు ఒక్కో దానికి రూ.20 లక్షలు పైనే బేరం పెట్టినట్లు సమాచారం.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)