Breaking News

జగన్‌ విజన్‌కే బాబు సర్కార్‌ జై..!

Published on Thu, 12/18/2025 - 04:33

సాక్షి, అమరావతి: వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ), లోకాయుక్తను కర్నూలులో ఏ­ర్పాటు చేయడంపై నానా యాగీ చేసి హైకోర్టులో పి­టిషన్‌లు దాఖలు చేయించిన టీడీపీ.. ఇప్పుడు జగన్‌ విజన్‌కే జై కొట్టింది. హెచ్‌ఆర్‌సీ, లోకాయుక్తలను విజయవాడకు తరలించాలని సూత్రప్రాయంగా నిర్ణయించామని గతంలో హైకోర్టుకు నివేదించిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని కర్నూలులోనే కొనసాగిస్తామని తాజాగా హైకోర్టుకు వివరించింది. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. ప్రభుత్వ విధా­న నిర్ణయంలో తామెలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‌ను ప్రశ్నించింది. 

ఈ వ్యవహారంలో 2021­లో ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌ రికార్డుల్లో లేకపోవడంతో హైకోర్టు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీ కార్యాల­యాలను కర్నూలులో ఏర్పాటు చేయాలన్న గత ప్రభుత్వ నిర్ణయా­న్ని సవాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్‌ మద్దిపాటి శైలజ 2021లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యం గతంలో విచారణకు వచ్చిన సందర్భంలో లోకాయుక్త, హెచ్‌ఆర్‌సీలను కర్నూలు నుంచి విజయవాడకు తరలించాలని సూ­త్రప్రా­య­ంగా నిర్ణయించామని చంద్రబాబు ప్రభు­త్వం పేర్కొంది. తాజాగా ఈ వ్యాజ్యంపై బుధ­వా­రం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రభుత్వం తర­ఫు­న ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణ­తి వాదనలు వినిపిస్తూ లోకా­యు­క్త, హెచ్‌ఆర్‌సీ కా­ర్యా­లయాలను కర్నూలులోనే కొనసాగిస్తామని చెప్పా­రు.

Videos

ఏం తమాషాలు చేస్తున్నారా.. కలెక్టర్ ఆఫీస్ వద్ద అధికారుల ఓవర్ యాక్షన్

పులివెందులలో YS అవినాష్ రెడ్డిపై కాల్పులు Exclusive Visuals

RO రూమ్ లో ఉంటే TDP గూండాలు వచ్చి.. దాడి చేశారు.. YSRCP అభ్యర్థి

విశాఖ మేయర్ నేనే.. పోటీ ఎవరున్నా గెలుపు నాదే

విద్యార్థులకు TDP డబ్బు,బిర్యానీ వైరల్ అవుతున్న ఆడియో రికార్డింగ్

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)