Breaking News

తిరుపతి తొక్కిసలాటపై.. తదుపరి ఆదేశాలు అక్కర్లేదు

Published on Thu, 02/13/2025 - 05:20

సాక్షి, అమరావతి :వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు మరణించడంతో పాటు 40 మందికి పైగా గాయపడిన ఘటనపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో జ్యుడీషియల్‌ కమిషన్‌ ఏర్పాటైన నేపథ్యంలో ఈ వ్యవహారంలో తదుపరి ఆదేశాలేవీ అవసరంలేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలాగే, విచారణ కమిషన్‌ తన నివేదికను గవర్నర్‌కు మాత్రమే సమర్పించేలా ఆదేశాలిచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. విచారణ నివేదికను గవర్నర్‌కు మాత్రమే ఇవ్వాలన్న నిబంధన ఏదీ చట్టంలో లేదని గుర్తుచేసింది.

అంతేకాక.. విచారణ గడువును 30 రోజులకే పరిమితం చేయాలన్న అభ్యర్థనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. కమిషన్స్‌ ఆఫ్‌ ఎంక్వయిరీ చట్టం కింద కమిషన్‌ను ఏర్పాటుచేయడం, విచారణ గడువును నిర్ధేశించడం పూర్తిగా ప్రభుత్వ విచక్షణాధికారమని తేల్చిచెప్పింది. కమిషన్‌ విచారణకు సమయం పడుతుందని..  అందువల్ల విచారణ పూర్తికి గడువును నిర్ధేశించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. తొక్కిసలాట ఘటనపై సిట్టింగ్‌ లేదా విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించడంతో పాటు, ఘటనపై విచారణ జరిపి 30 రోజుల్లో నివేదికను గవర్నర్‌కు సమర్పించేలా ఆదేశాలివ్వాలని కోరు­తూ కర్నూలు జిల్లా, పాండురంగాపురానికి చెందిన రైతు గుదిబండ ప్రభాకర్‌రెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేసిన విషయం తెలిసిందే. 

దీనిపై గత వారం వాదనలు విని తీర్పు వాయిదా వేసిన ధర్మాసనం, బుధవారం తన నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు..  తొక్కిసలాటపై విచారణకు ఆదేశించాలని కోరుతూ విజయవాడకు చెందిన వంగవీటి నరేంద్ర పిల్‌ను సైతం హైకోర్టు పరిష్కరించింది. 

Videos

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)