Breaking News

వివరణ ఇవ్వండి

Published on Fri, 07/12/2024 - 05:44

సాక్షి, అమరావతి: కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా తమ పార్టీ కేంద్ర కార్యాలయ భవనం కూల్చివేతకు పాల్పడిన అధికారులపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్‌సీపీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. కూల్చివేతలకు బాధ్యులైన సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌లకు వివరణ ఇవ్వాలంటూ నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 8వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 

నిర్మాణంలో ఉన్న వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేసేందుకు మున్సిపల్‌ కమి­షనర్‌ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. విచారణ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ.. చట్ట ప్రకారం నడుచుకుంటామని కోర్టుకు హామీ ఇచ్చారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. వైఎస్సార్‌సీపీ భవనం కూల్చివేత విషయంలో తదుపరి చర్యలు చేపట్టే ముందు చట్టప్రకారం నడుచుకోవాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, మున్సిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌ కుమార్‌లను ఆదేశిస్తూ గత నెల 21న ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ ఆదేశాలను వైఎస్సార్‌సీపీ తరఫు సీనియర్‌ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి లిఖితపూర్వకంగా సీఆర్‌డీఏ కమిషనర్, మున్సిపల్‌ కమిషనర్‌ దృష్టికి తీసుకొచ్చారు. కానీ కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆ మరుసటి రోజు తెల్లవారుజామున వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేశారు. దీంతో సీఆర్‌డీఏ కమిషనర్‌ కాటంనేని భాస్కర్, మునిసిపల్‌ కమిషనర్‌ నిర్మల్‌కుమార్‌లపై కోర్టు ధిక్కార చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు శేషగిరిరావు పిటిషన్‌ దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యం గురువారం విచారణకు రాగా.. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నన్నపనేని శ్రీహరి అధికారుల వ్యవహారశైలిని.. కోర్టు ధిక్కారాన్ని న్యాయమూర్తికి వివరించారు. వాదనలు విన్న న్యాయమూర్తి ప్రతివాదులుగా ఉన్న అధికారులిద్దరికీ నోటీసులు జారీ చేశారు.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)