Breaking News

సివిల్‌ వివాదాలలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు?

Published on Fri, 07/24/2026 - 05:25

సాక్షి, అమరావతి: సివిల్‌ కేసుల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండిపడింది. అసలు మీరెందుకు సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని నిల­దీసింది. సివిల్‌ వివాదాల్లో పోలీసులు జోక్యం చేసు­కో­కుండా తక్షణమే నిలువరించాలని రాష్ట్ర ప్రభు­­త్వాన్ని ఆదేశించింది. విశాఖపట్నంలో ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం(పీఎల్‌సీఎఫ్‌) పేరుతో ఓ వ్యవస్థను ఏర్పాటు చేసి, సివిల్‌ వివాదాల్లో పోలీ­సులు జోక్యం చేసుకుంటున్న వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

పోలీసులు వేధిస్తున్నారంటూ పిటిషన్లు 
ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం పేరుతో విశాఖపోలీసులు సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకోవడంతోపాటు నిత్యం తమను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి వేధిస్తున్నారని సినీ నిర్మాత నట్టికుమార్‌ గత నెల­లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే అంశంపై వ్యాపారి మంచుకొండ రామకృష్ణ కూడా పిటి­­­­­షన్‌ దాఖలు చేశారు. ఈ రెండు వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్‌ అవధానం హరిహరనాథశర్మ విచారణ జరిపారు. కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న సివిల్‌ వివాదాలను ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం ద్వారా పరిష్కరించుకోవాలంటూ విశాఖ పోలీసులు తమను నిత్యం వేధిస్తున్నారని వారు న్యాయమూర్తి దృష్టికి తీసుకొచ్చారు. 

వీరి వాదనలు విన్న న్యాయమూర్తి ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం పేరుతో విశాఖ పోలీసులు సివిల్‌ కేసుల్లో జోక్యం చేసుకుంటున్నట్లు నిర్ధారణకు వచ్చారు. ఫోరం పరిధి, దాని చట్టబద్ధత, అధికారాలు, పరిమితులపై సందేహం వ్యక్తం చేశారు. ఈ ఫోరం సంగతి ఏంటో తేల్చేందుకు కేసు రికార్డులు అన్నింటినీ ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజి­స్ట్రీని ఆదేశించారు. దీంతో రిజిస్ట్రీ కేసు రికార్డులను సీజే ముందుంచారు. వాటిని పరిశీలించిన సీజే, దీనిని రిట్‌ పిటిషన్‌గా మలచాలని ఆదేశించి గురువారం విచారణ జరిపారు. 

అసలు పోలీసులు ఎందుకు సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకుంటున్నారని గట్టిగా ప్రశ్నించింది. ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ, ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం గురించి పూర్తి వివరాలను కోర్టు ముందుంచుతామని, ఇందుకు కొంత సమయం కావాలని కోరారు. ఇందుకు ధర్మాసనం అంగీకరించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)