Breaking News

ప్రజలు కోర్టుకొచ్చే పరిస్థితి ఎందుకు తెస్తున్నారు?

Published on Sun, 01/26/2025 - 05:18

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రిజిస్ట్రార్లు, సబ్‌ రిజిస్టా­ర్ల తీరుపై హైకోర్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్య­క్తం చేసింది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో స్ప­ష­­్టమైన తీర్పులిచ్చినా అందుకు విరుద్ధంగా వ్యవహరి­స్తున్నారంటూ ఆక్షేపించింది.  చట్టాల విషయంలో అ­ధికారుల అజ్ఞానం వల్ల హైకోర్టులో పిటిషన్లు వరద­లా దాఖలవుతున్నాయని, ప్రజలను కోర్టులకు వ­చ్చి తీరే పరిస్థితులు కల్పిస్తున్నారని స్పష్టం చేసింది. 

వే­లంలో కొన్న ఆస్తికి మార్కెట్‌ విలువ ప్రకారం స్టాంపు డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు వసూలు చేయడాని­కి వీల్లేదని పునరుద్ఘాటించింది. ఇలాంటి­వి పునరావృ­త్తం కాకుండా ఉండాలంటే రిజ్రిస్టార్, సబ్‌ రిజ్రిసా­్టర్లకు న్యాయవ్యవస్థలో, చట్టాలలో వస్తున్న కొత్త మార్పులపై జ్ఞానోదయం కలిగించాలని స్పష్టం చేసింది. ఎప్పటికప్పుడు వర్క్‌షాపులు, శిక్షణ తరగతులు నిర్వహించాలంది. 

ఇందుకోసం ఓ ‘లీగల్‌ మా­డ్యూల్‌’ని రూపొందించాలని ప్ర­భు­­త్వా­న్ని ఆదేశించింది. అప్పుడే స­మర్థవం­తమైన ఫలితాలు సాధ్యమవుతా­య­ని తెలిపింది. ఈ లీగల్‌ మా­డ్యూల్‌ రూపకల్పన విషయంలో అడ్వొకే­ట్‌ జనరల్‌తో సంప్రదించాలని రెవెన్యూ శా­ఖ ముఖ్య కార్యదర్శిని ఆదేశించింది. నాలుగు వా­రాల్లో ఈ లీగల్‌ మాడ్యూల్‌ని రూపొందించాలని తే­ల్చి చెప్పింది. అనంతరం శిక్షణ కార్యక్రమాలు ని­ర్వ­హించాలంది. 

తమ ఈ ఆదేశాల అమలు పురోగ­తికి సంబంధించిన వివరాలతో 8 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత కే­సు­లో పి­టిషనర్లు వేలంలో కొన్న ఆస్తికి దాని విలువ ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు ఖరారు చే­యా­లని తిరుపతి సబ్‌ రిజ్రిస్టార్‌ను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ కీలక తీర్పు వెలువరించారు. 

కేసు నేపథ్యమిదీ 
కడపకు చెందిన కొండపనేని మల్లికార్జున, లోకేశ్‌ కస్తూరి, హైదరాబాద్‌కు చెందిన స్వాతి కస్తూరి తిరుపతి కెనరా బ్యాంక్‌ నిర్వహించిన ఈృవేలంలో తిరుపతి సెంట్రల్‌ పార్క్‌ కమర్షియల్‌ కాంప్లెక్స్‌లోని పలు షాపులను రూ.2.17 కోట్లకు కొనుగోలు చేశారు. ఆ ఆస్తిని తమ పేర రిజిస్టర్‌ చేయాలంటూ తిరుపతి సబ్‌ రిజ్రిస్టార్‌ను మల్లికార్జున తదితరులు ఆశ్రయించారు. 

సదరు ఆస్తికి మార్కెట్‌ విలువ (రూ.3.65 కోట్లు) ఆధారంగా 6.5 శాతం స్టాంప్‌ డ్యూటీ, 1 శాతం రిజ్రిస్టేషన్‌ ఫీజు చెల్లించాలని సబ్‌ రిజ్రిస్టార్‌ స్పష్టం చేశారు. ఈ మొత్తం చెల్లిస్తేనే రిజ్రిస్టేషన్‌ చేస్తామని తేల్చి చెప్పారు. తాము వేలంలో ఈ ఆస్తిని కొన్నామని, అందువల్ల మార్కెట్‌ విలువ ప్రకారం కాకుండా ఆస్తి విలువ (రూ.2.17 కోట్లు) ఆధారంగా స్టాంప్‌ డ్యూటీ, రిజ్రిస్టేషన్‌ ఫీజు చెల్లిస్తామని, నిబంధనలు కూడా ఇదే చెబుతున్నాయని మల్లికార్జున తదితరులు చెప్పారు. 

సబ్‌ రిజ్రిస్టార్‌ ఒప్పుకోకపోవడంతో వారు హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై న్యాయమూర్తి జస్టిస్‌ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్‌ విచారణ జరిపారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)