Breaking News

పరకామణిలో సంస్కరణలు తప్పనిసరి

Published on Sat, 12/20/2025 - 05:28

సాక్షి, అమరావతి: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి పరకామణి వ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని హైకోర్టు స్పష్టంచేసింది. హుండీల్లో భక్తులు సమర్పించే కానుకల లెక్కింపు, రవాణా, సీలింగ్, డీ–సీలింగ్, ఖాతాల నిర్వహణ వంటి అంశాల్లో ఇప్పటికీ అనుసరిస్తున్న పాత విధానాల్లో మానవ జోక్యాన్ని తగ్గిస్తూ, కృత్రిమ మేథస్సు (ఏఐ), ఆధునిక యంత్రాలు, డిజిటలైజేషన్‌ వంటి సాంకేతిక పరి­జ్ఞానాన్ని వినియోగించాల్సిన అవసరం ఉందని టీ­టీ­డీకి తేల్చిచెప్పింది. 

హుండీల్లో కేవలం డబ్బు మా­త్ర­మే కాకుండా ఎన్నో వస్తువులు భక్తులు సమర్పిస్తారని కోర్టు గుర్తుచేసింది. ఇవన్నీ వర్గీకరించడంలో నేటి ఆధునిక యంత్రాలు, ఏఐ సాంకేతికత సమర్థవంతంగా పనిచేస్తాయని తెలిపింది. తక్షణ, శాశ్వత ప్రణాళికలను రూపొందించి వాటిని తమ ముందుంచాలని టీటీడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 26కి వాయిదా వేసింది.

సీఐడీ, ఏసీబీ దర్యాప్తునకు ఆదేశం..
శ్రీవారి పరకామణి చోరీ కేసును లోక్‌ అదాలత్‌లో రాజీచేసుకోవడంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ తిరుపతికి చెందిన పాత్రికేయుడు ఎం.శ్రీనివాసులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యవహారంపై సీఐడీ దర్యాప్తునకు ఆదేశించింది. అలాగే, నిందితుడు రవికుమార్‌ ఆస్తులపై దర్యాప్తు జరపాలని ఏసీబీని ఆదేశించింది. 

ఆ కానుకలు.. భక్తుల మనోభావాలకు ప్రతీకలు..
శ్రీవారికి భక్తులు హుండీలో సమర్పించిన ప్రతి కానుక భక్తుల విశ్వాసానికి ప్రతీకగా భావించాల్సి ఉంటుందని హైకోర్టు స్పష్టంచేసింది. అందుకే వాటి భద్రత, పారదర్శక లెక్కింపునకు అత్యంత ప్రాముఖ్యతను ఇస్తున్నామని పేర్కొంది. హుండీ నిర్వహణ, కానుకల లెక్కింపులో పారదర్శకత లేకపోతే భక్తుల మనోభావాలు దెబ్బతింటాయని టీటీడీకి తేల్చిచెప్పింది. భక్తుల మనోభావాలను పరిరక్షించాల్సిన బాధ్యత టీటీడీదేనని స్పష్టంచేసింది. 

ఇక పరకామణి వ్యవస్థలో తక్షణ సంస్కరణల కోసం ప్లాన్‌–ఏ ను రెండు వారాల్లో, శాశ్వత ఆధునీకరణ కోసం ప్లాన్‌–బీని ఎనిమిది వారాల్లో సమర్పించాలని టీటీడీ బోర్డును హైకోర్టు ఆదేశించింది. ప్లాన్‌–ఏ అమలుకు అవసరమైన నిపుణుల కమిటీలను ఏర్పాటుచేయాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కలిగిన భక్తుల సేవలను వినియోగించుకోవచ్చని సూచించింది. 

అలాగే, పరకామణిలో చోరీచేస్తూ దొరికిన ఓ ప్రైవేటు మఠం ఉద్యోగి సీవీ రవికుమార్, ఆయన కుటుంబ సభ్యులు జరిపిన ఆస్తుల బదలాయింపు వివరాలను సీల్డ్‌ కవర్‌లో ఒక వారంలో తమ ముందుంచాలని ఏసీబీ డైరెక్టర్‌ జనరల్‌ను హైకోర్టు ఆదేశించింది.   

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)