Breaking News

రఘురామకృష్ణంరాజు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

Published on Thu, 02/15/2024 - 19:29

సాక్షి, విజయవాడ: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూపొందించిన వివిధ పాలసీలు, తీసుకున్న నిర్ణయాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ నరసాపురం వైసీపీ ఎంపీ కె.రఘురామకృష్ణంరాజు వేసిన పిటిషన్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈ సందర్బంగా అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టు ముందు పలు కీలక విషయాలు ప్రస్తావించారు. 

రాఘురామకృష్ణం రాజు చట్టం గురించి తెలియని అమాయకుడేమీ కాదని.. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసని అన్నారు. కోర్టుల్లో ఏం జరుగుతుందో ఆయనకు బాగా తెలుసన్నారు. కోర్టు ప్రొసీడింగ్స్‌పై వ్యాఖ్యలు చేయడం కూడా తెలుసని, కావాలనే వాస్తవాలను తొక్కిపెట్టి ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని తెలిపారు. ఆయన దురుద్దేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని న్యాయస్థానాన్ని కోరారు.

ఈ పిటిషన్‌ వెనక రఘురామరాజుకు వ్యక్తిగత ప్రయోజనాలున్నాయని అడ్వొకేట్‌ జనరల్‌ శ్రీరామ్‌ కోర్టుకు నివేదించారు. విష ప్రచారంలో భాగంగానే ఈ వ్యాజ్యం దాఖలు చేశారన్నారు. కేసుల గురించి చెప్పలేదని, స్పీకరిచ్చిన ఫిర్యాదు ప్రస్తావన లేదని గుర్తు చేశారు. ట్రిబ్యునల్‌లో ధిక్కార చర్యల గురించి పేర్కొనలేదని తెలిప

పైపెచ్చూ ఎలాంటి కేసులు లేవని పిల్లో డిక్లరేషన్ ఇచ్చారని, అన్నీ దాచిపెట్టి దాఖలు చేసిన ఈ వ్యాజ్యానికి విచారణార్హత లేదని పేర్కొన్నారు. కోర్టుకొచ్చిన వ్యక్తి సదుద్దేశంతో వచ్చారో లేదో చూడాలని, సీఎం గురించి ఆయన ఏం మాట్లాడారో ఓసారి చూడాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు అడ్వొకేట్ జనరల్. దీనిపై స్పందించిన కోర్టు.. రఘురామకృష్ణంరాజు మాట్లాడిన మాటల వీడియోలను పరిశీలిస్తామని చెప్పింది. తదుపరి విచారణ మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం ప్రకటించింది.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)