Breaking News

పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌

Published on Sat, 05/31/2025 - 03:34

సాక్షి, అమరావతి: ముంబయి సినీ నటి కాదంబరి జత్వానీ ఫిర్యాదు ఆధారంగా ఇబ్రహీంపట్నం పోలీసులు నమోదు చేసిన కేసులో సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి పీఎస్సార్‌ ఆంజనేయులుకు హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ కేసులో పీఎస్సార్‌ ఆంజనేయులు ఇప్పటికే 36 రోజులుగా జ్యుడిషియల్‌ కస్టడీలో ఉన్నారని న్యాయమూర్తి జస్టిస్‌ లక్ష్మణరావు తన తీర్పులో పేర్కొన్నారు. ఆరోపణల్లో తీవ్రత, దర్యాప్తు పురోగతి, ముగిసిన పోలీసు కస్టడీ, కేసులో పిటిషనర్‌ పాత్ర తదితరాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పీఎస్సార్‌ ఆంజనేయులుకు బెయిల్‌ మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 

దర్యాప్తు అధికారి ఇప్పటికే 50 మందికి పైగా సాక్షులను విచారించారన్నారు. కఠిన షరతులతో బెయిల్‌ మంజూరు చేస్తే పిటిషనర్‌ చట్టం నుంచి పారిపోయే అవకాశం లేదన్నారు. ఇప్పటికే ఆంజనేయులు సస్పెన్షన్‌లో ఉన్నారని న్యాయమూర్తి గుర్తు చేశారు. అంతేకాక జత్వానీ కేసులో ఇతర నిందితులైన పోలీసు అధికారులకు హైకోర్టు గతంలోనే ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిందని, అలాగే తదుపరి చర్యలన్నీ కూడా నిలిపేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. 

ఓ అమా­యక వ్యక్తిపై తప్పుడు కేసు బనాయించారా అన్న విషయాన్ని తేల్చాల్సింది సంబంధిత కోర్టులేనన్నారు. పోలీసులపై ఫిర్యాదు చేయడం, వారిని ప్రాసిక్యూట్‌ చేయడంపై సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 కింద నిషేధం ఉందని న్యాయమూర్తి తన తీర్పులో స్పష్టం చేశారు. తీర్పు కాపీ శుక్రవారం సాయంత్రం అందుబాటులోకి వచ్చింది.  

మీడియాతో మాట్లాడకూడదు 
ఈ కేసు గురించి మీడియాతో సహా ఎవరి ముందూ కూడా మాట్లాడటానికి వీల్లేదని పీఎస్సార్‌ ఆంజనేయులును హైకోర్టు ఆదేశించింది. రూ.20 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని, చార్జిషీట్‌ దాఖలు చేసేంత వరకు ప్రతి రెండో శనివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 లోపు సీఐడీ దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని చెప్పింది. 

కోర్టు అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదని, కోర్టులో పాస్‌పోర్ట్‌ సరెండర్‌ చేయాలని స్పష్టం చేసింది. దర్యాప్తునకు సహకరించాలని, ఇంకా ఎప్పుడు అవసరమైతే అప్పుడు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని.. ఈ కేసు గురించి వాస్తవాలు తెలిసిన వారిని ప్రత్యక్షంగా, పరోక్షంగా భయపెట్టడం, బెదిరించడం, ప్రలోభపెట్టడం చేయరాదని హైకోర్టు చెప్పింది.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)