Breaking News

సివిల్‌ వివాదాల్లో మీ జోక్యం ఏంటి?

Published on Wed, 05/28/2025 - 02:30

సాక్షి, అమరావతి : సివిల్‌ వివాదాల్లో పోలీసుల జోక్యంపై హైకోర్టు మండి పడింది. భూమికి సంబంధించిన సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకునేందుకు పోలీసులకు ఎలాంటి అధికారం లేదని తేల్చి చెప్పింది. వ్యక్తుల మధ్య భూ వివాదాలు తలెత్తితే వాటిని పరిష్కరించేందుకు సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సీపీసీ) కింద సివిల్‌ కోర్టులు ఉన్నాయని స్పష్టం చేసింది. అలాగే న్యాయ సంబంధిత వివాదాలను పరిష్కరించేందుకు చట్టబద్ధ సంస్థలైన రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, మండల న్యాయ సేవాధికార సంస్థలు ఉన్నాయని గుర్తు చేసింది. 

సివిల్‌ వివాదాలను పరిష్కరించేందుకు పోలీసులు ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం (పీఎల్‌సీఎఫ్‌) పేరుతో ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం వల్ల కక్షిదారుల మనసులో ఓ రకమైన కలవరపాటు కలగడంతో పాటు పుట్టగొ­డు­గుల్లా వివాదాలు మొదల­వు­తాయ ని చెప్పింది. భూ వివాదాల పరిష్కారా­ని­కి ఏ పేరుతో కూడా సివిల్‌ కేసుల్లో జోక్యం చేసుకో­వడానికి వీల్లేదని విశాఖపట్నం పోలీసులను హైకో­ర్టు ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్‌ జస్టిస్‌ యడవల్లి లక్ష్మణరావు ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. 

74 ఏళ్ల వృద్ధురాలి న్యాయ పోరాటం 
ఓ సివిల్‌ వివాదంలో విశాఖపట్నం పోలీస్‌ కమిషనర్‌ తనను పదే పదే పిలిపిస్తూ వేధిస్తున్నారని, సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకోకుండా పోలీసులను ఆదేశించాలని కోరుతూ విశాఖపట్నం బే కాలనీకి చెందిన 74 ఏళ్ల వృద్ధురాలు ఎస్‌.శ్యామల హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ లక్ష్మణరావు ఇటీవల విచారణ జరిపారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వట్టికూటి సూర్య నారాయణ వాదనలు వినిపిస్తూ.. వెంకట సత్య నాగ కృష్ణంరాజు, గోపాలరాజు, వెంకట సత్యనారాయణ రాజులతో శ్యామలకు సివిల్‌ వివాదం కొనసాగుతోందన్నారు. 

పోలీసులు ప్రీ లిటిగేషన్‌ కౌన్సెలింగ్‌ ఫోరం పేరుతో సివిల్‌ వివాదాన్ని పరిష్కరించుకోవాలంటూ పిటిషనర్‌ను ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. దీనిపై న్యాయమూర్తి పోలీసుల వివరణ కోరారు. ప్రీ లిటిగేషన్‌ కౌన్సిలింగ్‌ ఫోరం పేరుతో వివాద పరిష్కారానికి పార్టీలను కౌన్సిలింగ్‌కు పిలిపిస్తుంటామని పోలీసులు తెలిపారు. ఒకవేళ పార్టీలు కౌన్సిలింగ్‌కు రాకూడదనుకుంటే రావాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో విశాఖ పోలీస్‌ కమిషనర్, భీమునిపట్నం పోలీసుల పాత్ర లేదని చెప్పారు. 

పిటిషనర్‌ వివాద పరిష్కారానికి ముందుకు రాకపోవడంతో కేసును మూసి వేశామని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి పోలీసుల తీరును ఆక్షేపించారు. పిటిషనర్‌ అయిన వృద్ధురాలికి ఇతరుల మధ్య నెలకొన్న భూ వివాదం పూర్తిగా సివిల్‌ వివాదమని, ఇలాంటి సివిల్‌ వివాదాల్లో జోక్యం చేసుకునే అధికారం పోలీసులకు లేదని తేల్చి చెప్పారు. ప్రీ లిటిగేషన్‌ కౌన్సెల్‌ ఫోరం పేరుతో సివిల్‌ వివాదాలను పరిష్కరించడానికి వీల్లేదన్నారు.

ప్రకాశం, పల్నాడు పోలీసులకు సైతం ఆదేశాలు 
ప్రకాశం జిల్లా ముండ్లమూరు పోలీసులు ఓ సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకుని సివిల్‌ కోర్టులో దాఖలు చేసిన సివిల్‌ సూట్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను ఒత్తిడి చేయడాన్ని కూడా జస్టిస్‌ లక్ష్మణరావు తప్పుపట్టారు. అలా చేయొద్దని పోలీసులను ఆదేశించారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పోలీసులకు కూడా న్యాయమూర్తి ఇదే విధమైన ఆదేశాలు ఇచ్చారు. కింది కోర్టులో వేసిన సూట్‌ను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌ను పోలీసులు బెదిరించడాన్ని ఆక్షేపించారు.

Videos

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)