Breaking News

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

Published on Tue, 01/27/2026 - 21:29

సాక్షి,విజయవాడ: మరోసారి రాష్ట్ర  పోలీసుల వ్యవహారశైలిపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పత్తికొండ న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపింది. కోర్టు గౌరవాన్ని కించపరిచే విధంగా పోలీసులు ప్రవర్తించారని మండిపడింది. 

విచారణ సందర్భంగా.. పోలీసులపై ప్రశ్నల వర్షం కురిపించింది. ‘జడ్జి అనుమతి లేకుండా కోర్టు హాల్లోకి ప్రవేశించి అరెస్టులు ఎలా చేస్తారు? అని ప్రశ్నించింది. ‘ఇలాంటి వాటిని అనుమతిస్తే పోలీసులు ఏమైనా చేస్తారు. హైకోర్టులో కూడా ఇలాగే అరెస్టులు చేస్తారా?’ కోర్టు గౌరవాన్ని దెబ్బతీసే విధంగా పోలీసులు తీరు సరైంది కాదని వ్యాఖ్యానించింది.

దౌర్జన్యం చేసిన పోలీసులకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశించింది. బాధ్యులైన అధికారులపై ఇప్పటివరకు ఏం చర్యలు తీసుకున్నారో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను తేలికగా తీసుకోవద్దని, న్యాయస్థానం గౌరవాన్ని కాపాడే బాధ్యత అందరికీ ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

పత్తికొండ న్యాయవాదుల సంఘం తరఫున దాఖలైన పిటిషన్‌లో, కోర్టు హాల్లోకి పోలీసులు అనుమతి లేకుండా ప్రవేశించి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు. ఈ పిటిషన్‌పై స్పందించిన హైకోర్టు, పోలీసుల వ్యవహారంపై కఠినంగా స్పందించింది. 

Videos

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)