Breaking News

24 నుంచి ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Published on Tue, 10/22/2024 - 06:26

సాక్షి, అమరావతి: రాష్ట్రానికి తుపాను ముప్పు పెద్దగా లేకపోయినా ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర అండమాన్‌ సముద్రంలో సోమవారం తెల్లవారుజామున ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం బలపడిందని, ఇది పశి్చమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారానికి వాయుగుండంగా, బుధవారానికి తూర్పుమధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడుతుందని తెలిపింది. ఆ తర్వాత వాయువ్య దిశగా పయనించి గురువారం ఉదయానికి ఒడిశా–పశి్చమ బెంగాల్‌ తీరాలకు చేరుకునే అవకాశం ఉందని పేర్కొంది.

గురువారం రాత్రి లేదా శుక్రవారం తెల్లవారుజామున ఇది తీవ్ర తుపానుగా ఉత్తర ఒడిశా, పశి్చమ బెంగాల్‌ తీరాల సమీపంలో పూరీ, సాగర్‌ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖాధికారులు తెలిపారు. దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలినచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శుక్రవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

తుపాను సన్నద్ధతపై సోమవారం ఢిల్లీ నుంచి కేంద్ర క్యాబినెట్‌ కార్యదర్శి అధ్యక్షతన జాతీయ సంక్షోభ నిర్వహణ కమిటీ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించింది. ఇందులో ఏపీ నుంచి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఉత్తరాంధ్ర జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేసినట్లు చెప్పారు. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలను సిద్ధంగా ఉంచామన్నారు. నేవీ అధికారులతో సమన్వయం చేసుకుని సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను వెనక్కి రప్పించినట్లు తెలిపారు. 
 

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు