Breaking News

కోస్తాంధ్రకు భారీ వర్షసూచన

Published on Wed, 12/18/2024 - 05:04

సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.

దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. 

19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

తీరంలో అలజడి
అల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నా­యి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్ల­కూ­రు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి. 

వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలు­లు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపి­లిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్ర­జలు చలికి గజగజ వణుకుతున్నారు. 

సా­యం­త్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయ­ట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేట­లో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అ­ల­­లు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నా­మని, తాము వేట ముగించుకుని, త్వరితగతి­న ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకా­­రులకు ఫోన్‌ ద్వారా సమాచారం అందజేశారు.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)