Breaking News

ఈనెల 5న మరో అల్పపీడనం.. ఏపీకి మళ్లీ భారీ వర్ష సూచన!

Published on Mon, 09/02/2024 - 16:26

సాక్షి, విశాఖపట్నం: భారీ వర్షాల కారణంగా ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఏపీ ప్రజలకు మరో హెచ్చరిక చేసింది వాతావరణ శాఖ. ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుందని విశాఖ వాతావరణ శాఖ తెలిపింది. దీంతో, కోస్తా జిల్లాలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పష్టం చేసింది.

కాగా, ఈనెల ఐదో తేదీన బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడి క్రమంగా బలహీనపడి తుపాన్‌గా మారే అవకాశం ఉన్నట్టు వాతావరణ పేర్కొంది. ఇక, తుపాన్‌గా బలపడిన అనంతరం ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో, కోస్తా తీరాన్ని ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది.

ఇదిలా ఉండగా..తాజాగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌ వద్ద రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వెళ్తోంది. దీంతో, విజయవాడ జల దిగ్భందమైంది. వరద నీరు ఇళ్లలోకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడానికి నీరు, తినడానికి తిండి లేకపోవడంతో స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందకపోవడంతో సర్కార్‌ తీరుపై మండిపడుతున్నారు. మరోవైపు.. తాజాగా వరదల కారణంగా 15 మం‍ది మరణించినట్టు తెలుస్తోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)