Breaking News

ఏపీకి బిగ్‌ అలర్ట్‌.. భారీ వర్ష సూచన

Published on Sat, 09/19/2026 - 15:55

సాక్షి, విశాఖపట్నం: ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. సాయంత్రానికి ఉత్తర అండమాన్ సముద్రంలో అల్పపీడనం ఏర్పడనుంది. పశ్చిమ వాయువ్య దిశలో కదులుతూ అల్పపీడనం మరింత బలపడుతుందని వాతావరణ శాఖ అంచనా.

ఈ నెల 23, 24వ తేదీ నాటికి తీవ్ర వాయుగుండం లేదా తుపానుగా ఉత్తర కోస్తా-దక్షిణ ఒడిస్సా మధ్య తీరం దాటే అవకాశం.. ఉందని పేర్కొంది. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ పలు కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. రేపటి నుంచి వర్షాలు మరింత పుంజుకొనున్నాయి.

శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, ఏలూరు, కాకినాడ, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు అలర్ట్‌ జారీ చేసిన ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ.. ఆయా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. 50-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని.. చెట్లు, హోర్డింగ్స్ వద్ద ఉండరాదని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

నిన్న(శుక్రవారం) ఎండ తీవ్రతతో పాటు కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. నంద్యాల జిల్లా కొలివిుగుండ్లలో 5, అనకాపల్లి జిల్లా బలిఘట్టంలో 4.8, కృష్ణాపురంలో 4.6, పెదబొడ్డేపల్లెలో 4.1, విజయనగరం జిల్లా కొత్తవలసలో 3.9, కాకినాడ జిల్లా రౌతులపూడిలో 2.1 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.

ఇదీ చదవండి: బాబు కరువు.. ఊర్లకు ఊర్లు ఖాళీ

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)