Breaking News

‘స్కిల్‌’ కేసులో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాల్సిందే

Published on Tue, 02/27/2024 - 05:03

సాక్షి, న్యూఢిల్లీ: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు బెయిల్‌ను రద్దు చేయాల్సిందేనని ఏపీ సీఐడీ సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. బెయిల్‌ షరతుల ఉల్లంఘన స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపించింది. చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు అధికారులను బెదిరిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ధర్మాసనం దృష్టికి తెచ్చింది. వచ్చే ఎన్నికల అనంతరం అధికారంలోకి వస్తా­మని.. ఆ తర్వాత చంద్రబాబు కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులపై ప్రతీకారం తీర్చుకుంటామని బెదిరిస్తున్నారని నివేదించింది. ఏపీ హైకోర్టు చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను సోమవారం న్యాయమూర్తులు జస్టిస్‌ బేలా ఎం.త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిత్తల్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది.

ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వచ్చాక స్కిల్‌ కేసును దర్యాప్తు చేస్తున్న అధికారులపై చర్య­లు తీసుకుంటామని బహిరంగంగా ప్రకటనలు చేస్తున్నారని ఏపీ సీఐడీ తరఫున సీనియర్‌ న్యాయ­వాది ముకుల్‌ రోహత్గి ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఇలా చేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి జస్టిస్‌ బేలా ఎం.త్రివేది జోక్యం చేసుకొని రికార్డుల్లో లేని అంశాలను పరిగణనలోకి తీసుకోబోమని తెలి­పారు. దీంతో చంద్రబాబు కుటుంబసభ్యుల ప్రకటనలకు సంబంధించి అదనపు డాక్యుమెంట్లు అందజేయడానికి ఏపీ సీఐడీ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశామని రోహత్గి కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సందర్భంగా ఏపీ సీఐడీ ఏం కోరుకుంటోందని జస్టిస్‌ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.. చంద్రబాబు బెయిల్‌ రద్దు చేయాలని రోహత్గి విన్నవించారు.

వచ్చే ఎన్నికల్లో టీడీపీ పోటీ చేస్తోందని, ఈ సమయంలో బెదిరింపు ప్రకటనలను తేలిగ్గా తీసుకో­రాదని తెలిపారు. చంద్రబాబు బెయిల్‌ రద్దు కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన అప్పీల్‌ కోర్టు ముందుందన్నారు. నిందితుడి కుటుంబ సభ్యుడి తీరు దిగ్భ్రాంతికరంగా ఉందని.. అధికారుల పేర్లన్నీ ఒక పుస్తకంలో రాస్తున్నట్లు చెబుతున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు. వీరి పార్టీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున బెదిరింపు ప్రకటనలు చేసేవా­రికి బెయిల్‌ ప్రయోజనం, స్వేచ్ఛ లభించకూడద­న్నదే తమ ఉద్దేశమన్నారు. దీన్ని చాలా తీవ్రంగా పరిగణించాలని కోర్టుకు విన్నవించారు.

చంద్ర­బాబు తరఫు సీనియర్‌ న్యాయవాది హరీష్‌ సాల్వే వాదనలు వినిపిస్తూ సీఐడీ అనుబంధ పిటిషన్‌పై స్పందించడానికి తమకు సమయం కావాలని  కోరారు. దీంతో రెండు వారా­ల్లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని న్యాయ­స్థానం ఆదేశించింది. అవసరమ­నుకుంటే పిటిషనర్‌ కూడా స్పందించవచ్చని పేర్కొంది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)