Breaking News

ఆధునిక టెక్నాలజీతో తిరుమలలో పటిష్ట భద్రత: హరీష్‌ కుమార్‌ గుప్తా

Published on Thu, 05/25/2023 - 07:28

తిరుమల: ఆధునిక టెక్నా­లజీ సాయంతో తిరుమలలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టనున్నట్లు రాష్ట్ర హోం శాఖ ప్రధాన కార్యదర్శి హరీష్‌ కుమా­ర్‌ గుప్తా చెప్పారు. తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1 వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తిరుమలలో 2 రోజుల పాటు భద్రతాపరమైన అంశాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సీసీటీవీ కంట్రోల్‌ రూంలో కృత్రిమ మేధను ఎలా వినియోగించాలి, ఎలాంటి సాఫ్ట్‌వేర్‌లను వాడాలనే అంశాలపై అధ్యయనం చేస్తామన్నారు. 

యాంటీ డ్రోన్‌ టెక్నాలజీ, బాడీ స్కానర్స్‌ వినియోగంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. డీఐజీ అమ్మిరెడ్డి మాట్లాడుతూ..భద్రతను మరింత కట్టుదిట్టం చేసేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలన జరపడానికి ఎస్పీ లేదా ఏఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో 7 కమిటీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ కమిటీల్లోని అధికారులు 15 రోజుల పాటు పరిశీలన జరిపి నివేదిక ఇస్తారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తర్వాత కమిటీలు చేసిన సూచనలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తామన్నారు. 

భద్రతాంశాల పరిశీలన.. 
అంతకుముందు శ్రీవారి ఆలయం, కొత్త పరకామణి భవనం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌–1, కమాండ్‌ కంట్రోల్‌ రూం తదితర ప్రాంతాలను పోలీస్‌ ఉన్నతాధికారులు పరిశీలించారు. కమాండ్‌ కంట్రోల్‌ రూంలో తిరుమలలో సీసీ కెమెరాల ద్వారా నేరస్తులను గుర్తించే విధానాన్ని పరిశీలించారు. తిరుమల అన్నమయ్య భవనంలో టీటీడీ సీవీఎస్‌వో నరసింహ కిషోర్, ఇంటెలిజె¯Œన్స్‌ ఎస్పీ సుమిత్‌ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో, ఇంటెలిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్, ఆక్టోపస్, బాంబుస్కా్వడ్, ఎస్పీఎఫ్, జిల్లా పోలీస్, అటవీ, అగి్నమాపక, ఇతర విభాగాలకు చెందిన అధికారులు, టీటీడీ అధికారులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బ్యాంకును బురిడీ కొట్టించిన టీడీపీ నేత 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)