భర్తను చంపేసి.. రాత్రంతా పోర్న్ వీడియోస్ చూస్తూ గడిపిన మాధురి‌..

Published on Thu, 01/22/2026 - 07:10

గుంటూరు జిల్లా: ప్రియుడితో కలిసి భర్తను చంపేసింది. ఆ తర్వాత భర్త మృతదేహం వద్దే ఒంటరిగా కూర్చుని రాత్రంతా పోర్న్‌ వీడియోలు చూస్తూ గడిపింది.. వివరాల్లోకెళ్తే.. గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరుకి చెందిన లోకం శివనాగరాజు(45), లక్ష్మీ మాధురి దంపతులు. ఉపాధి నిమిత్తం వీరు కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వెళ్లారు. అక్కడ సినిమా హాల్‌లో పనిచేస్తున్న మాధురికి తరచూ సినిమాలకు వచ్చే గోపీ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఈ పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. గోపీ హైదరాబాద్‌లో కార్‌ ట్రావెల్స్‌ నిర్వహిస్తుండడంతో, శివనాగరాజుకు డ్రైవింగ్‌ రావడంతో, అతన్ని డ్రైవర్‌గా పంపించి గోపీ మాధురితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించాడు. 

విషయం బయట పడడంతో శివనాగరాజు తన భార్యను తీసుకుని చిలువూరులో నివాసముంటున్న తన తండ్రి, మాజీ ఎంపీటీసీ లోకం గాంధీ వద్దకు వచ్చారు. అయితే, మాధురి ఇక్కడికి వచ్చాక కూడా గోపీతో వివాహేతర సంబంధం కొనసాగించింది. మరోసారి వీరిద్దరి వ్యవహారంపై శివ నాగరాజు ప్రశి్నంచడంతో ఎలాగైనా భర్తను అడ్డు తొలగించుకోవాలని భావించిన భార్య హత్యకు పథకం రచించింది. ప్రియుడితో నిద్ర మాత్రలు తెప్పించి ఈనెల 18న రాత్రి శివనాగరాజుకు భోజనంలో కలిపి ఇచ్చింది. దీంతో శివనాగరాజు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. 

అనంతరం ప్రియుడు గోపీని పిలిపించి ఇద్దరూ కలిసి శివనాగరాజు ముఖంపై దిండు పెట్టి నొక్కి ఊపిరి ఆడకుండా చేసి చంపేశారు. విషయం తెలుసుకున్న మృతుడి తండ్రికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా నిర్ధారించి లక్ష్మీ మాధురిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో హత్య ఉదంతం మొత్తం వెల్లడించింది. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసును హత్య కేసుగా మార్చి, నిందితుడు గోపీ కోసం గాలింపు చేపట్టారు.   

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)