Breaking News

నేడు డ్వాక్రా మహిళలకు రుణాలు మంజూరు

Published on Sat, 03/08/2025 - 05:21

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నామని, బ్యాంకుల నుంచి రుణాలను ఇప్పించడంతో పాటు యూనిట్ల ఏర్పాటులో 45శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. శనివారం అంతర్జాతీయ మహిళాదినోత్సవం సందర్భంగా రూ.14,000 కోట్ల రుణాలను డ్వాక్రా మహిళలకు అందిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. 

అదే విధంగా ఇంటి వద్ద ఖాళీ సమయంలో పనిచేసే విధంగా వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానం ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం విజయవాడలో ఎలీప్‌ నిర్వహిస్తున్న ఎంఎస్‌ఎంఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన చంద్రబాబు మాట్లాడుతూ 50 శాతం మంది మహిళలు పనిచేస్తేనే 2047 స్వర్ణాంధ్ర లక్ష్యం సాధ్యమవుతుందన్నారు. 

ఇందుకోసమే ప్రతీ ఇంటి నుంచి ఒక పారిశ్రామికవేత్త నినాదం తీసుకున్నామని తెలిపారు. రతన్‌ టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికి అనుసంధానంగా ఐదు రీజనల్‌ హబ్‌లు ఉంటాయని, ఒక ఆలోచనతో వస్తే దాన్ని ఏ విధంగా పారిశ్రామీకరణ చేయాలో ప్రభుత్వం దగ్గరుండి చేయిపట్టి అడుగులు వేయిస్తుందన్నారు. 

అనకాపల్లి జిల్లా, కోడూరు వద్ద 31 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఎలీప్‌ మహిళా పారిశ్రామిక పార్కు ద్వారా 200 యూనిట్లు ఏర్పాటు కావడమే కాకుండా 10,000 మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు. టెక్నాలజీని వినియోగించుకొని అడుగుముందుకేసే వారికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని తెలిపారు.   

Videos

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)