Breaking News

మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌

Published on Mon, 02/09/2026 - 17:51

సాక్షి,గుంటూరు: మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్‌ మంజూరైంది. గుంటూరు స్పెషల్‌ మొబైల్‌ కోర్టు అంబటికి బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్‌ చేసింది. సీఎం చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ ఇచ్చింది. ఇదే కేసులో రాజమండ్రి జైలులో రిమాండ్‌లో ఉన్నారు. పోలీసులు కస్టడీ పిటిషన్‌ను తిరస్కరించింది. 

పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు
గతేడాది నవంబర్‌ నెలలో కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ‘ప్రజా ఉద్యమం’ పేరుతో ర్యాలీ నిర్వహించింది. అయితే, గుంటూరులో ఈ ర్యాలీ నిర్వహించిన అంబటి రాంబాబుపై పట్టాభిపురం పోలీసులు అక్రమ కేసులు నమోదు చేశారు.

కేసుకు సంబంధించి గుంటూరు కోర్టులో పోలీసులు అంబటిని హాజరు పరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. దీంతో  చంద్రబాబుపై వ్యాఖ్యలు చేశారంటూ జనవరి 31న అరెస్టు చేసిన కేసులో బెయిల్‌ వచ్చినప్పటికీ.. మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ ర్యాలీ కేసులో రిమాండ్‌లో కొనసాగనున్నారు. ఈ కేసులోనూ బెయిల్‌ వస్తే అంబటి విడుదలయ్యే అవకాశం ఉంది. 

44 కేసులు 
కాగా కూటమి ప్రభుత్వం మాజీ మంత్రిపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఈ నేపథ్యంలో గడిచిన ఎనిమిది రోజుల్లో అంబటి రాంబాబుపై 36 కేసులు నమోదు చేశారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు మెుత్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 44 కేసులు నమోదయ్యాయి.

అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు

Videos

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)