Breaking News

గ్రానైట్‌ పరిశ్రమల తిరుగుబాటు

Published on Sun, 11/30/2025 - 04:23

సాక్షి ప్రతినిధి, బాపట్ల/బల్లికురవ/మార్టూరు: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం మైనింగ్‌పై విచ్చలవిడిగా పన్నులు వసూలుచేయడాన్ని నిరసిస్తూ.. శనివారం బాపట్ల జిల్లా బల్లికురవ మండలం వేమవరం జంక్షన్‌లోని ఏఎంఆర్‌ చెక్‌పోస్టు వద్ద గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు, కార్మికులు పెద్దఎత్తున నిరసనకు దిగారు. ఆగ్రహంతో చెక్‌పోస్టు కంటైనర్‌ బాక్స్‌­ను బద్దలుకొట్టారు. కంప్యూటర్లు, ఇతర సామగ్రితోపాటు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.

అయితే, విద్యుత్‌ శాఖా మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ సొంత నియోజకవర్గం అద్దంకి నుంచే గ్రా­నైట్‌ పరిశ్రమల యజమానులు, కార్మికులు ప్రభు­త్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు శ్రీకారం చు­ట్టారు. అలాగే, ఆందోళనలో పాల్గొన్న వారిలో 90 శాతం అధికార టీడీపీకి చెందిన వారే ఉన్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో.. మల్లాయి­పాలెం, వేమవరం, ఉప్పమాగులూరు, కొనె­దన, గంగపాలెం, నక్కబొక్కలపాడు గ్రామా­ల పరిధి­లోని 500 పరిశ్రమల నుంచి పలువురు యజమా­నులతోపాటు వేలాది మంది కార్మికులు జంక్షన్‌కు తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ప్రభు­త్వం రాయలీ్ట, జీఎస్టీ అంటూ పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందంటూ తీవ్రంగా నిరసించారు. 

చంద్రబా­బు సర్కారు తీరును దుమ్మెత్తిపోశారు. ప్రభు­త్వం దుర్మా­ర్గంగా పన్నులు వేసి గ్రానైట్‌ వ్యాపా­రాన్ని కుదేలు చేసిందని మండిపడ్డారు. వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డి పాలనలో ఒక కట్టర్‌కు రూ.27 వేలు టాక్స్‌ వసూలు చేస్తే.. చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా కట్టర్‌కు రూ.35 వేల రాయల్టీతోపాటు రూ.5 వేల జీఎస్టీ వసూలుచేస్తోందన్నారు. ఇదికాక.. కట్టర్‌కు మరో రూ.35 వేలు కప్పం కింద  వసూలు చేస్తున్నారన్నారు. వసూలు బాధ్యతలు ఏఎంఆర్‌కు అప్పజెప్పడంతో వారు చెక్‌పోస్టులు పెట్టి దోపిడీకి పాల్పడుతున్నారని పరిశ్రమల యజమానులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత మొత్తంలో పన్నులు, ఇతరత్రా చెల్లించి వ్యాపారం చేయలేమన్నారు. 

కోట్లాది రూపాయల పెట్టుబడి పెట్టిన పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని, అదే జరిగితే తాము నష్టపోవడమే కాక యుపీ, ఎంపీ, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, పశి్చమ బెంగాల్‌ తదితర రాష్ట్రాల నుంచి పొట్టచేతబట్టుకుని వచి్చన కార్మికులు రోడ్డునపడతారని పరిశ్రమల యజమానులు చెబుతున్నారు. ప్రభుత్వం పన్నుల పేరుతో దోపిడీకి పాల్పడుతోందని యజమానులుతోపాటు కార్మికులూ మండిపడుతున్నారు. తక్షణం ప్రభు­త్వం అధికంగా విధించిన పన్నులు ఉపసంహరించుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

ఉద్రిక్తంగా మారిన ఆందోళన.. 
ఇదిలా ఉంటే.. యజమానులతోపాటు వేలాది మంది కార్మికులు వేమవరం జంక్షన్‌కు చేరుకోవడంతో పరి­స్థితి ఉద్రిక్తంగా మారింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. ఒక్కసారిగా ఆందోళనకారులు అక్కడే వున్న ఏఎంఆర్‌ చెక్‌పోస్టు కంటైనర్‌ బాక్స్‌ వద్దకు వెళ్లి దానిని కూలదోశారు. బాక్స్‌­లో వున్న కంప్యూటర్‌ సెట్, సీసీ కెమెరాలను ధ్వంసం చేశారు. చెక్‌పోస్ట్‌ లైటింగ్‌ పోల్‌ను నేలమట్టం చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమా­చారం అందుకున్న పోలీసులు వేమవరం చేరుకుని ఆందోళనకారులను శాంతింప జేశారు. 

దీంతో.. మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో నిరసనకారులు ఆందోళన విరమించారు. ప్రభుత్వం విధించిన పన్నుల భారానికి వ్యతిరేకంగా గ్రానైట్‌ పరిశ్రమల యజమానులు, కార్మికులు  నాలుగు రోజుల క్రితం మార్టూరు జాతీయ రహదారిపై జొన్నతాళి గ్రామం వద్ద  నిరసన తెలిపారు.

గ్రానైట్‌ సంఘ ప్రతినిధులకు డీఎస్పీ హెచ్చరిక 
అనంతరం మార్టూరు పోలీస్‌స్టేషన్‌లో శనివా­రం రాత్రి బాపట్ల డీఎస్పీ గోగినేని రామాంజనేయులు ఇరువర్గాలతో సమావేశమయ్యా­రు. చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తే గ్రానైట్‌ అసోసి­యేషన్‌ సభ్యులపై, ఏఎంఆర్‌ సంస్థ ప్రతి­­నిధులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)