Breaking News

మనవడిని అమ్మేసిన తాత

Published on Tue, 07/01/2025 - 12:06

తాటిచెట్లపాలెం(విశాఖపట్నం): కుమార్తె ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని తండ్రి, తన కుమార్తెకు పుట్టిన మగబిడ్డను ఆమెకు తెలియకుండానే దత్తత ఇచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలు నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం బయటపడింది. అరకు ప్రాంతానికి చెందిన పెట్టెల దివ్య (23) అదే ప్రాంతానికి చెందిన జాన్‌బాబును ప్రేమించి వివాహం చేసుకుంది. దివ్య తండ్రి పి. శుక్రకు ఈ వివాహం మొదటి నుంచి ఇష్టం లేదు. 

వారిద్దరినీ విడదీయడానికి అతను పలు ప్రయత్నాలు చేశాడు. ఈ క్రమంలో దివ్య, జాన్‌బాబు మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ సమయంలో దివ్య గర్భవతి కావడంతో, ప్రసవం కోసం ఆమె తండ్రి శుక్ర విశాఖలోని కై లాసపురం ప్రాంతానికి తీసుకువచ్చి, అద్దె ఇంట్లో ఉంచాడు. దివ్యకు కేజీహెచ్‌లో మగబిడ్డ జన్మించాడు. బిడ్డకు పచ్చకామెర్లు ఉన్నాయని, అనారోగ్యంగా ఉన్నాడని, వైద్యం చేయించాలని చెప్పి, దివ్యతో పలు పత్రాలపై సంతకాలు చేయించాడు. 

అనంతరం తల్లికి తెలియకుండా ఆ బిడ్డను దత్తత పేరుతో విక్రయించాడు. రెండు నెలలు గడిచినా బిడ్డ ఆచూకీ తెలియకపోవడంతో దివ్య తన తండ్రిని నిలదీసింది. సరైన సమాధానం రాకపోవడంతో, దివ్య మొదట కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో, ఆపై నేరుగా పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్‌ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి బిడ్డ ఆచూకీని కనుగొన్నాయి. బిడ్డను మొదట ఆర్‌అండ్‌బీ వద్ద గల శిశుగృహకు అప్పగించారు. సోమవారం పోలీసుల సమక్షంలో ఆ బిడ్డను తల్లిదండ్రులైన దివ్య, జాన్‌బాబులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)