Breaking News

ప్రధాని సభలో భో‘జనం పాట్లు’

Published on Sat, 05/03/2025 - 04:29

సాక్షి ప్రతినిధి, గుంటూరు, తాడికొండ/ మంగళ­గిరి: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన ఏర్పాట్లలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. సమావేశానికి తప్పకుండా రావాల్సిందేనని, లేదంటే రుణాలు, ఇతర పథకాలు మంజూరు కావంటూ భయపెట్టి ప్రజలను తీసుకొచ్చినా.. వారికి కనీస ఏర్పాట్లు చేయలేకపోయారు. ఇంటింటికీ ఆహ్వా­నం పలికిన అమరావతి రైతులకు కూడా అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయి. 

ఆహ్వాన పత్రిక ఉంటే చాలని చెప్పినా, వారిని ప్రతిచోట పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై రైతులు అసంతృప్తి వెళ్లబుచ్చారు. వాహనాలను మూడు కి.మీ దూరంలోనే నిలిపివేయడంతో మండే ఎండలో అక్కడినుంచి రావడానికి మహిళలు ఇబ్బందిపడ్డారు. వారికి ఇచ్చిన భోజనం ఉదయాన్నే ప్యాక్‌ చేసినది కావడంతో పాచి వాసన వస్తోందని మహిళలు తినకుండా పక్కన పడేశారు. 

రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు మినహా పరిసర ప్రాంతాల నుంచి జన సమీకరణను టీడీపీ క్యాడర్‌ పట్టించుకోలేదు. రెండో దశ పూలింగ్‌ పేరుతో చంద్రబాబు మీడియాకు లీకులిస్తుండటం.. రాజధాని రైతులకు న్యాయం చేయకుండా మళ్లీ తమ భూములు ఎక్కడ లాక్కుంటారో అనే ఆందోళనతో ఈ ప్రాంత టీడీపీ క్యాడర్‌ డుమ్మా కొట్టారు. 
» పోలీసులు అన్ని మార్గాల నుంచి జనాన్ని వదిలినా సభా ప్రాంగణ పరిసరాల్లో కూడా పెద్ద సంఖ్యలో కనిపించలేదు.  
»   రాజధాని పరిసర ప్రాంతాల నుంచి డ్వాక్రా మహిళలు భారీగా తరలిరావాలని హుకుం జారీ చేసినా, అధికారులు ఎంత ప్రయత్నించినా జనం కదలలేదు. 
»  ప్లాస్టిక్‌ బిర్యానీ డబ్బాలో స్వస్తిక్‌ కంపెనీకి చెందిన చిన్నపాటి పచ్చడి ప్యాకెట్లు దర్శనమివ్వగా, కొన్నింటిలో ఉడికీ ఉడకని గోంగూర వేసి ఇవ్వడంతో ఆగ్రహంతో మహిళలు, టీడీపీ క్యాడర్‌ రోడ్ల వెంట పారేశారు.  

అమరావతి రైతులకు మళ్లీ అవమానం 
ప్రధాని సభకు ఉత్సాహంగా వెళ్తున్న అమరావతి రైతులు మహిళలకు ఎప్పటిలాగే తీరని అన్యాయం జరిగింది. ఆహ్వాన పత్రమే వీఐపీ పాస్‌ కంటే ఎక్కువ అంటూ పంచినా, నిన్న మొన్నటివరకు ఇంటింటికీ తిరిగి చెప్పిన నాయకులు, ప్రజాప్రతిని«ధులు వారిని గాలికొదిలేశారు. 

»  అమరావతి రైతులను వీఐపీ మార్గాల్లోకి అనుమతించకుండా పోలీసులు నెట్టివేశారు. మీరు ఇటువైపు కాదు తిరిగి రావాలనడంతో మహి­ళలు, రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నమ్మి వేలాది ఎకరాల భూములిచ్చిన మాకు సభకు వెళ్ళాలంటే ఇన్ని ఆంక్షలు ఎందుకని పలువురు కంటతడి పెట్టారు. ఆహ్వాన పత్రం చూపించినా నెట్టేయడం చాలా బాధించిందన్నారు. 

»  దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కాజ టోల్‌గేట్‌ సమీపంలో దశావతారం దేవాలయం పక్కనే ట్రాన్సిట్‌ పాయింట్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడ పోలీసులు, రెవెన్యూ అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపించింది. ట్రాన్సిట్‌ పాయింట్‌ ముందే కంతేరు అడ్డరోడ్డుకు కొన్ని వాహనాలు తరలించడంతో ప్రజలు భోజనం లేక అవస్థలు పడ్డారు. కనీసం తాగునీరు కూడా అందలేదు.   

కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌  
టోల్‌గేటు వద్ద నుంచి చినకాకాని వరకు భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. వందలకొద్దీ బస్సులు ఒకేసారి టోల్‌గేటు వద్దకు రావడం, ఒకదానివెంట ఒకటి వెళ్లి ఆహార కేంద్రాల వద్ద ఆగడంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది.

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)