Breaking News

తాత్కాలిక శు‘భ్రమేనా’..!

Published on Sat, 11/08/2025 - 04:09

సాక్షి, అమరావతి: విజయవాడ సామాజిక న్యాయ మహాశిల్పం అంబేడ్కర్‌ ప్రాంగణంలో సర్కారు పారిశుద్ధ్య పనులు చేపట్టింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నిర్మించిన మహాశయుని మహాశిల్పంపై చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఆది నుంచి వివక్ష, నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీంతో ‘‘అంబేడ్కర్‌పైనా కూటమి కక్ష!’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించడంతో సర్కారు తీరుపై దళిత, గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. దీంతో ఎట్టకేలకు దిగొచ్చి­న సర్కారు శుక్రవారం ప్రాంగణంలో హడావుడిగా పారిశుద్ధ్య పనులు చేపట్టింది. 

వాటర్‌ ఫౌంటెయిన్లలో పేరుకుపోయిన పసరు నీటిని తొలగించింది. వాటిని మళ్లీ మంచినీటితో నింపాల్సి ఉంది. ప్రాంగణం మొత్తం పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, శుభ్రంచేయించింది. ఈ చర్యలపై దళిత, గిరిజన సంఘాలు గళమెత్తాయి. కేవలం తాత్కాలిక కంటితుడుపు చర్యలతో సరిపెట్టకుండా స్ఫూర్తిదాయకమైన ప్రాంగణాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. 

దీనిని ప్రైవేట్‌పరం చేయకుండా పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని కోరుతున్నాయి. సామాజిక న్యాయ మహాశిల్పం పరిరక్షణకు, అభివృద్ధికి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఈ నెల 26న రాజ్యాంగ దినోత్సవం రోజున ‘చలో అంబేడ్కర్‌ విగ్రహం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నద్ధమయ్యాయి.  

పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి 
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విజయ­వాడ నడిబొడ్డున నిర్మించిన సామాజిక న్యాయ మహాశిల్పంపై కూటమి సర్కారు దృష్టిపెట్టాలి. ఈ ప్రాంగణాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలి.   – అండ్ర మాల్యాద్రి, కేవీపీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి 

ప్రజా సంఘాలపై టీడీపీ బురదజల్లడం సరికాదు   
సామాజిక న్యాయ మహాశిల్పం పట్ల కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్న ప్రజా సంఘాలు, అంబేడ్కరిస్టులపై టీడీపీలోని కొందరు ఎస్సీ నాయకులు బురదచల్లే తీరు సరికాదు. అభివృద్ధికి చర్యలు చేపట్టాలి.   – శ్వేతా బుడమూరి, సమతా సైనిక దళ్‌ మహిళా అధ్యక్షులు 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)