Breaking News

పోలీసు అధికారులకు ప్రభుత్వం జీతభత్యాలు ఇవ్వడం లేదు

Published on Thu, 11/06/2025 - 05:23

సాక్షి, అమరావతి: రాజకీయ కక్షసాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రంలో పలువురు పోలీసు అధికారులను వేకెన్సీ రిజర్వ్‌ (వీఆర్‌)లో ఉంచి ఎలాంటి జీతాలు చెల్లించకపోవడాన్ని ప్రశ్నిస్తూ తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై బుధవారం ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది. 

గురుమూర్తి తరఫు న్యాయవాది వి.మహేశ్వరరెడ్డి వాదనలు వినిపిస్తూ... ‘‘విధి నిర్వహణలో నిక్కచి్చగా వ్యవహరిస్తారనే పేరున్న పోలీసు అధికారులను చాలాకాలంగా ప్రభుత్వం వీఆర్‌లో ఉంచింది. ప్రభుత్వం సహేతుక కారణాలు లేకుండానే ఇలా చేసింది. ఇది చట్ట విరుద్ధం. 199 మంది అధికారులకు జీతభత్యాలు అందడం లేదు. వారి కుటుంబాలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నాయి. 

పోలీసు సంస్కరణల విషయమై ప్రకాశ్‌సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టమైన ఆదేశాలు, మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిని ప్రతి రాష్ట్రం పాటించాల్సి ఉంది’’ అని తెలిపారు. ధర్మాసనం స్పందిస్తూ, ప్రకాశ్‌­సింగ్‌ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదంటే ఈ విష­యాన్ని సుప్రీంకోర్టు దృష్టికే తీసుకెళ్లాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. 

జీతాలు అందక ఇబ్బందులు పడుతుంటే సంబంధిత పోలీ­సు అధికారులే కోర్టుకు వస్తారని, వారి తరఫున వ్యాజ్యాన్ని దాఖలు చేయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడమే మేలని పిటిషనర్‌కు సూచించింది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)