Breaking News

టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీతో మంచి ఉద్యోగాలు 

Published on Sun, 08/13/2023 - 04:56

సాక్షి, అమరావతి: దేశంలో వ్యవసాయం తర్వాత రెండో అతిపెద్ద ఉపాధి రంగం జౌళి పరిశ్రమ. జౌళి రంగం ప్రత్యక్షంగా, పరోక్షంగా దేశంలో 10 కోట్ల మందికి ఉపాధి కలి్పస్తూ వేగంగా పురోగమిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఔళి పరిశ్రమను మరింతగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నప్పటికీ నిపుణుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 300కు పైగా జౌళి మిల్లులు ఉన్నాయి.

వీ­టికి ఏటా వందలాది మంది నిపుణులు అవసరం. అయినా ఏడాదికి 50 మంది కూడా దొరక ట్లేదు. భవిష్యత్తులో జౌళి రంగంలో విద్య, ఉద్యోగ, పారిశ్రామిక, ఎగుమతుల విభాగాల్లో అవకాశాలు గణనీయంగా పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే గుంటూరులోని గవర్న మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ సంస్థ జౌళి రంగ నిపుణులను తయారు చేస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది.  

మూడున్నరేళ్ల పాలిటెక్నిక్‌ కోర్సు 
టెక్స్‌టైల్స్‌ డిప్లొమా కోర్సులు చదివిన వారికి మంచి జీతభత్యాలతో ఉద్యోగాలు లభిస్తున్నాయి. సాధారణ డిప్లొమా కోర్సు మూడేళ్లు ఉంటే.. టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ కోర్సు మాత్రం మూడున్నరేళ్లు ఉంటుంది. ఈ కోర్సు అభ్యసించిన వారికి స్పిన్నింగ్, వీవింగ్, కెమికల్‌ ప్రాసెసింగ్, టెస్టింగ్, ఆధునిక టెక్నికల్‌ టెక్స్‌టైల్, అపారల్‌ మాన్యుఫాక్చరింగ్‌ వంటి విభాగాల్లో మంచి ఉద్యోగాలు వస్తాయి. కోర్సు పూర్తి చేసిన వెంటనే స్థానికంగా ప్రారంభ వేతనం కనీసం రూ.20 వేలు ఉంటుంది.

ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు ప్రభుత్వం సైతం ఇండస్ట్రీ కనెక్ట్‌ విధానాన్ని అమలు చేస్తూ సిలబస్‌ను ఆధునీకరించింది.ఇందులో భాగంగా ఏడాది పాటు ప్రత్యేక పారిశ్రామిక శిక్షణనిస్తూ నెలకు రూ.7 వేల వరకు స్టైపెండ్‌ ఇస్తోంది. ‘పూర్వ విద్యార్థుల ద్వారా ప్రేరణ సదస్సులు, క్యాంపస్‌ ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ చివరి సెమిస్టర్‌ పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి కి సగటున మూడు సంస్థల్లో రూ.20 వేలకు పైగా జీతభత్యాలతో ఉద్యోగాలు వస్తున్నాయి.

8 నుంచి 10 ఏళ్ల అనుభవంతో కెరీర్‌లో అత్యున్నత స్థాయికి చేరుకోవచ్చు’ అని గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ శాఖాధిపతి కె.మహమ్మద్‌ తెలిపారు. గుంటూరులోని టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ చదువుకున్న విద్యార్థులు తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాల్లోని ప్రముఖ పరిశ్రమల్లో సుమారు రూ.3 లక్షల జీతంతో జనరల్‌ మేనేజర్, టెక్నికల్‌ మేనేజర్, మిల్‌ మేనేజర్, గ్రూప్‌ మేనేజర్‌ హోదాల్లో రాణిస్తుండటం విశేషం. 

ఇది మంచి అవకాశం 
గుంటూరులో 1986లో స్థాపించిన ఈ కాలేజీ 1997కి స్వయం ప్రతిపత్తి సాధించింది. 2023 పాలిసెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు ఈ కోర్సులో చేరొచ్చు. డిప్లొమా తర్వాత బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ చేసి ప్రముఖ విద్యా సంస్థల్లోనూ అ­ధ్యాప­కు­లు­గా, పరిశోధన సంస్థల్లో శాస్త్రవేత్తలుగా రా­ణిం­చవచ్చు. ఇందులో అత్యధిక ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉన్నప్పటికీ అవగాహన లేమితో విద్యార్థులు నష్టపోతున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్యాబోధన, ప్రాక్టికల్స్, ఇండ్రస్టియల్‌ ట్రైనింగ్, పరిశ్రమ ప్రముఖుల ద్వారా సెమినార్స్‌ ద్వారా సమగ్ర శిక్షణ అందిస్తున్నాం. విద్యార్థులు ఈ కోర్సులో ప్రవేశాలు, వివరాలకు 9848372886, 8500724006 నంబర్లను సంప్రదించవచ్చు. 
– కేవీ రమణ బాబు, ప్రిన్సిపాల్, గవర్నమెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ టెక్నాలజీ, గుంటూరు  

Videos

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

కేటీఆర్, హరీష్ రావు అరెస్ట్..!

విజయవాడ పోలీస్ స్టేషన్ లో యూట్యూబర్ నందన

కేసీఆర్ ఫాంహౌస్ వద్ద 144 సెక్షన

మహికాతో బ్రేక్ అప్? అమీషా పటేల్ తో హార్దిక్ డేటింగ్!

Photos

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)