Breaking News

ప్రైవేటు చేతుల్లోకి ప్రభుత్వ డేటా!

Published on Fri, 10/25/2024 - 05:47

సాక్షి, అమరావతి:‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన సంపద ఏదైనా ఉంది అంటే.. అది ఒక్క డేటా మాత్రమే. ఎవరి దగ్గర ఎక్కువ డేటా ఉంటే వారే అత్యంత ధనికులు’ అమరావతి డ్రోన్‌ సదస్సులో సీఎం చంద్ర­బాబు చెప్పిన మాటలివి. నూతన టెక్నాలజీ పరు­గులు పెడుతున్న తరుణంలో డేటా అత్యంత విలువైన­దని సీఎం చంద్రబాబు చెబుతూనే.. అత్యంత విలు­వైన ప్రభుత్వ డేటాను ప్రైవేటు ఏజెన్సీల చేతిలో పెట్ట­డానికి కూటమి ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మంగళగిరిలోని ‘పై డేటా సెంటర్‌’లో గల స్టేట్‌ డేటా సెంటర్‌ నిర్వహణ బాధ్యతలను థర్డ్‌ పార్టీ ఏజె­న్సీ­లకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు ఆహ్వానించింది. 

రెండేళ్ల లీజు కాలానికి స్టేట్‌ డేటా సెంటర్‌ నిర్వ­హణకు రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన ఏపీ టెక్నాలజీ సర్వీ­సెస్‌ లిమిటెడ్‌ (ఏపీటీఎస్‌ఎల్‌) బిడ్లు పిలిచింది. ప్రముఖ సిస్టమ్‌ ఇంటిగ్రేటర్, డేటా సెంటర్‌ మేనేజ్డ్‌ సర్వీస్‌ ప్రొవైడర్లు టెండర్లలో పాల్గొన­వచ్చని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం డిజిటల్‌ ఇండియా పేరుతో ఈ–గవర్నెన్స్‌ను ప్రోత్సహిస్తోందని, దీన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్రంలో ఈ–గవ­ర్నెన్స్‌ కార్య­క్రమా­లను కొనసాగించడం కోసం మౌలిక సదు­పా­యాల అభివృద్ధిలో భాగంగా ఈ డేటాసెంటర్‌ నిర్వహ­ణను ప్రైవేటు సంస్థలకు అప్పగి­స్తు­న్నట్టు టెండర్‌ నోటీసులో పేర్కొన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ఇన్ఫర్మేషన్‌ అండ్‌ కమ్యూని­కేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) ప్రాధాన్యతను గుర్తి­ం­చిందని, ఐటీ సేవలను విస్తరించడం ద్వారా ప్రభు­త్వ పథకాలను విజయవంతంగా అమలు చేయ­ను­న్నట్టు పేర్కొంది. ఆసక్తి గల సంస్థలు అక్టోబర్‌ 30 మధ్యాహ్నం 3గంటలలోపు టెండర్‌ దాఖలు చేయాల్సి ఉంటుందని, కాంట్రాక్టు గెలి­చిన సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న తేదీ నుంచి రెండేళ్ల పాటు సేవలను అందించాల్సి ఉంటుందని బిడ్‌ డాక్యుమెంట్‌లో పేర్కొంది.

ఐటీ నిపుణుల ఆందోళన
డేటా చౌర్యంతో సైబర్‌ నేరాలు పెరు­గు­తున్న తరుణంలో ప్రభుత్వ డేటా నిర్వ­హణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై ఐటీ నిపుణలతో పాటు అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ డేటా సెంటర్‌ నిర్వహణను ప్రభుత్వమే చేపట్టడం ద్వారా ప్రజలకు భరోసా కల్పించాల్సిన ఆవశ్య­కత ప్రభుత్వంపై ఉందని అధి­కా­రులు స్పష్టం చేస్తు­న్నారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఐటీ గ్రిడ్‌ పేరుతో డేటా చౌర్యం జరగడంపై తీవ్ర దుమారమే రేగిందన్న విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.  ఇప్పు­డు ఏకంగా ప్రభుత్వ డేటా సెంటర్‌ నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించడంపై వీరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)