Breaking News

గోదా‘వడి’ పెరుగుతోంది

Published on Wed, 09/04/2024 - 04:19

సాక్షి, అమరావతి/పోలవరం రూరల్‌: ఎగువన విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3.05 లక్షల క్యూసెక్కులు వరద నీరు చేరింది. గోదావరి డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. ఎగువ నుంచి వరద వస్తున్న నేపథ్యంలో బ్యారేజ్‌లో ఫ్లడ్‌కుషన్‌ ఉంచడానికి కొంతమేర ఖాళీ చేస్తూ సముద్రంలోకి 3.09 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 

మహారాష్ట్రలో కురిసిన వర్షాల ప్రభావం వల్ల శ్రీరాంసాగర్‌లోకి 2.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. గేట్లు ఎత్తేసి 2.40 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. దాని దిగువన ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 4.72 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు వదిలేస్తున్నారు. ప్రాణహిత ఉద్ధృతితో కాళేశ్వరం ప్రాజెక్టు (మేడిగడ్డ బ్యారేజ్‌)లోకి 9.02 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. దాని దిగువన సమ్మక్క బ్యారేజ్‌లోకి 7.23 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌లోకి 7.55 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. 

భద్రాచలం వద్ద మంగళవారం రాత్రికి గోదావరి 39 అడుగుల నీటిమట్టానికి చేరుకుంది. ఇది క్రమేపీ పెరు­గుతూ అర్ధరాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దిగువన పోలవరం ప్రాజెక్టు వద్ద 29.550 మీటర్ల మేర నీటిమట్టం ఉంది. స్పిల్‌వే నుంచి 4 లక్షల 12 వేల క్యూసె­­క్కుల నీరు దిగు­­వకు చేరుతోంది. భారీ వర్షాల కారణంగా వర­ద మరింత పెరిగే అవకా­శం ఉందని అధికారు­లు భావిస్తున్నారు.  

Videos

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)