Breaking News

నాకన్నా మీకు చెల్లి అంటేనే ఇష్టం కదా.. నేనేం తప్పు చేశానమ్మా!

Published on Tue, 11/30/2021 - 07:55

సాక్షి,పెందుర్తి(విశాఖపట్నం): తన కంటే సోదరిని తల్లిదండ్రులు బాగా చూసుకుంటున్నారని మనస్థాపం చెంది సుజాతనగర్‌ గోపాలకృష్ణనగర్‌కు చెందిన కె.జీవిత(18) సోమవారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కాలనీలో నివాసం ఉంటున్న కె.రాంబాబు, రజని దంపతులకు ఇద్దరు కుమార్తెలు. రాంబాబు ఆర్‌ఎంపీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పెద్ద అమ్మాయి జీవిత డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుంది.

తన కంటే చెల్లిని బాగా చూసుకుంటున్నారన్న కారణంతో జీవిత.. తల్లితో నిత్యం గొడవ పడేది. ఈ క్రమంలో సాయంత్రం కూడా గొడవ పడి గదిలోకి వెళ్లిన జీవిత బయటకు ఎంతకీ రాకపోవడంతో బలవంతంగా తలుపులు తెరిచేసరికి విగతజీవిగా కనిపించింది. పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. సీఐ అశోక్‌కుమార్‌ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చదవండి: డబ్బు, నగలు తీసుకుని.. మాజీ ప్రియుడితో పారిపోయిన పారిశ్రామికవేత్త భార్య

Videos

ఈడీపై సుప్రీం ఆగ్రహం

కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై టీడీపీ సీరియస్ నేతల ఫైర్

మహిళల సింధూరాన్ని చెరిపినవారిని మట్టిలో కలిపేశాం : మోదీ

మెడికల్ మాఫియా బాగోతం! ఫేక్ డాక్టర్ల మాయాజాలం

ఇజ్రాయెల్ వర్సెస్ ఇరాన్ Conflict 2025

Rain Alert: మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు

KTR: నీ కేసులకు భయపడేది లేదు

రేషన్ డోర్ డెలివరీ రద్దుపై వైఎస్ జగన్ రియాక్షన్..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్

Operation Trashi: టాప్ 6 ఉగ్రవాదులు హతం..

Photos

+5

కొడుకు, చెల్లెలితో సానియా మీర్జా క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

Miss World 2025 : శిల్పారామంలో ఆడి పాడుతూ సందడి చేసిన గ్లోబల్‌ బ్యూటీలు (ఫొటోలు)

+5

లిక్కర్‌ స్కాం.. బాబు బేతాళ కథలు.. జగన్‌ ధ్వజం (చిత్రాలు)

+5

అనసూయ ఇంట మరో శుభకార్యం.. పెద్ద కుమారుడితో సంప్రదాయ వేడుక (ఫొటోలు)

+5

HHVM మూవీ ఈవెంట్‌లో మెరిసిన హీరోయిన్ నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

Cannes 2025 : ‘సింధూరం’తో మెరిసిన ఐశ్వర్య (ఫోటోలు)

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)