Breaking News

చినబాబు చెప్పారు చేయాల్సిందే

Published on Fri, 08/02/2024 - 04:55

సాక్షి, అమరావతి : చేతికొచ్చిన అధికారాన్ని అడ్డు పెట్టుకుని తాము చెప్పిన పని క చ్చితంగా చేసి తీరాల్సిందేని కూటమి నేతలు ఉన్నతాధికారులకు హుకుం జారీ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) సీఎండీ.. ‘చినబాబు’ చెప్పారని రాత్రికి రాత్రే రాజమహేంద్రవరం ఎస్‌ఈ పోస్టుకు సంబంధించిన ఆదేశాలను మార్చేయడం విద్యుత్‌ శాఖలో తీవ్ర చర్చకు దారితీసింది. 

కాకినాడ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తున్న గొర్లె ప్రసాద్‌ను రాజమహేంద్రవరం ఎస్‌ఈగా పదోన్నతిపై నియమిస్తూ డిస్కం సీఎండీ ఐ.పృధ్వీతేజ్‌ బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం సీఎంఓలోని ఓ ఉన్నతాధికారి ద్వారా మంత్రి లోకేశ్‌కు తెలియడంతో వెంటనే ఆ ఆదేశాలు రద్దు చేసి, తాను చెప్పిన అధికారిని ఆ పోస్టులో నియమించాలని చెప్పారు. ఈ మేరకు ఆ ఉన్నతాధికారి ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీని ఫోన్‌లో దీనిపై హెచ్చరించారు. 

సీఎంఓ ఆగ్రహాం వ్యక్తం చేయడంతో ప్రసాద్‌ను కార్పొరేట్‌ కార్యాలయంలో జనరల్‌ మేనేజర్‌(ఆపరేషన్స్‌)గా పంపి, ఆ స్థానంలో ఉన్న కె.తిలక్‌ కుమార్‌ను రాజమహేంద్రవరం ఎస్‌ఈగా నియమిస్తూ అర్ధరాత్రి 11.30 గంటల తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఈ సంఘటన విద్యుత్‌ ఉద్యోగ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇందుకు కారణం ఏమంటే.. 

ఎన్నికల ముందు అవినీతి కేసులో రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో చంద్రబాబు రిమాండ్‌ ఖైదీగా ఉన్నప్పుడు ప్రభుత్వ వైద్యురాలిగా తిలక్‌ భార్య ఆయనకు చికిత్స అందించారని తెలిసింది. బాబు సూచనల మేరకు వైద్యం అందించినందుకే ఆమెకు నజరానాగా ఆమె భర్తకు ఎస్‌ఈ పోస్టును కట్టబెట్టారని సమాచారం. 

కాగా, ఇంధన శాఖలో ఇప్పటికే జేఎండీలు, ఎండీలు, డైరెక్టర్లు అంటూ పది మందికి పైగా ఉన్నతాధికారుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. వారి స్థానంలో తమ వారిని నియమించేందుకు రూ.కోట్లల్లో బేరసారాలు సాగిస్తున్నట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్‌ఈ పోస్టుకు రూ.50 లక్షల వరకు, ఎలక్ట్రికల్‌ ఇంజనీర్‌ పోస్టుకు రూ.10 లక్షలు వసూలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)