Breaking News

బాబు కనుసన్నల్లోనే ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ మార్పు

Published on Sat, 09/30/2023 - 04:01

సాక్షి, అమరావతి : అమరావతి ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు (ఐఆర్‌ఆర్‌) అలైన్‌మెంట్‌లో మార్పు­లు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్ర­బాబు కనుసన్నల్లోనే జరిగాయని సీఐడీ హైకోర్టుకు తెలిపింది. అలైన్‌మెంట్‌ ఎలా ఉండాలో ముందే ఓ నిర్ణయానికి వచ్చి, దానికి అను­గుణంగా ప్రాజెక్టు పనులు దక్కించుకున్న సంస్థ చేత అలైన్‌మెంట్‌ను తయారు చేయించారని వివరించారు. ఈ మార్పుల ద్వారా వ్యాపారవేత్త లింగమనేని రమేశ్‌కు చంద్ర­బాబు లబ్ధి చేకూర్చారని చెప్పింది. అందుకు ప్రతిఫలంగా రమేష్‌ కృష్ణానది కరకట్ట సమీపంలో ఉన్న తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని తెలిపింది. ఇది క్విడ్‌ ప్రోకోయేనని వెల్లడించింది.

ఇప్పటికే స్కిల్‌ కుంభకోణం కేసులో అరెస్టయి రిమాండ్‌ ఖైదీగా ఉన్న చంద్రబాబు.. ఐఆర్‌ఆర్‌ ముసుగులో జరిగిన భూ దోపిడీ కేసులో ముందస్తు బెయిలు కోరుతూ హైకోర్టులో దాఖలు చేసిన పిటి­షన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ కంచిరెడ్డి సురేష్‌­రెడ్డి శుక్రవారం మరోసారి విచారణ జరి­పారు. ఈ సందర్భంగా సీఐడీ తరఫున అడ్వొ­కేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. అలైన్‌మెంట్‌ మార్పు వల్ల రమేశ్‌ భూములను కాపాడటమే కాక, వాటి విలువ ఎంతో పెరిగేలా చేశారని ఆయన వివరించారు.  రమేశ్‌ బ్యాంకు ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు కూడా జమ చేశారని, అందుకు లెక్కలు కూడా చూపలేదన్నారు. దానిని ఇంటి అద్దెగా చంద్రబాబు తదితరులు చెబుతున్నారని తెలిపారు.

రెండేళ్ల తరువాత అద్దె చెల్లించడంలో అంతరార్థం ఏమిటో తెలుసుకోవాల్సి ఉందని అన్నారు. ఇందు­కోసం చంద్రబాబును కస్టడీలోకి తీసుకుని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపా­రు. ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ప్రాజెక్టు అమలు వెనుక అవినీతి జరిగింది కాబట్టే అవినీతి నిరోధక చట్టం కింద కూడా చంద్రబాబుపై కేసు నమోదు చేశామని చెప్పారు. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్‌ ప్రాజెక్టును నామినేషన్‌ పద్ధతిలో అప్పగించడాన్ని అప్పటి సీఆర్‌డీఏ అధికారులు వ్యతిరేకించారని, వాటిని పట్టించుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. దురుద్దేశంతో అర్హత నిబంధనలు కుదించేశారన్నారు. అలైన్‌మెంట్‌ పరిధిలోకి కావాల్సిన వారి భూములు రాకుండా జాగ్రత్త పడ్డారని తెలిపారు. మాస్టర్‌ ప్లాన్‌ను సైతం అలాగే రూపొందించారని వివరించారు.

ప్రాజెక్టు రూపకల్పన, అమలు, దాని వెనుక ఉన్న ఉద్దేశాలను చూడాలని కోర్టును కోరారు. ఈ ప్రాజెక్టు వెనుక క్విడ్‌ ప్రో కో ఉందన్నారు. ఐఆర్‌ఆర్‌ పేరుతో ఆస్తులు అమ్ముకుని, డబ్బు గడించారని తెలిపారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం కేసులో చంద్రబాబు అరెస్టయి రిమాండ్‌లో ఉన్న నేపథ్యంలో ఈ కేసులో కూడా ఆయన అరెస్ట్‌ అయినట్లు భావించడానికి వీల్లేదన్నారు. అలా భావిస్తే దర్యాప్తునకు తీవ్ర విఘాతం కలుగుతుందని చెప్పారు. అందువల్ల ఈ కేసులో చంద్రబాబుకు బెయిల్‌ మంజూరు చేయవద్దని కోర్టును కోరారు.

చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌ వాదనలు వినిపిస్తూ.. లింగమనేనికి చెల్లించిన అద్దెపై సీఐడీకి అనుమానాలుంటే చంద్రబాబుకు నోటీసులు జారీ చేసి వివరణ కోరితే పూర్తి వివరాలు సమర్పించే వారిమని అన్నారు. ఇంత చిన్న దానికి కస్టోడియల్‌ విచారణ అవసరం ఏముందన్నారు. తాము చెల్లించిన డబ్బుకు రమేశ్‌ లెక్కలు చూపకుంటే అది చంద్రబాబు తప్పెలా అవుతుందని ప్రశ్నించారు. ఈ కేసులో సీఐడీ వాస్తవాలను కప్పిపుచ్చుతోందన్నారు. సీఐడీ దర్యాప్తు మొత్తం పక్షపాతంతో సాగుతోందన్నారు. కోర్టు సమయం ముగియడంతో న్యాయమూర్తి తదుపరి విచారణను అక్టోబర్‌ 3కి వాయిదా వేశారు. 

Videos

టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. లారెన్స్ బిష్ణోయ్ సంచలన ప్రకటన

వైఎస్సార్ జిల్లాలో ఉద్రిక్తత.. YSRCP ఛైర్మన్ అభ్యర్థి పోరెడ్డి ఇంటిపై టీడీపీ దాడి

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)