Breaking News

గుడ్‌న్యూస్‌: ఈ రూట్లలో సంక్రాంతి పండుగకి ప్రత్యేక రైళ్లు

Published on Thu, 01/05/2023 - 16:26

సాక్షి, విశాఖపట్నం: సంక్రాంతి నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యార్థం కాచిగూడ–శ్రీకాకుళం రోడ్‌–వికారాబాద్‌ మధ్య వయా దువ్వాడ మీదుగా ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డీసీఎం ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు.  
►కాచిగూడ–శ్రీకాకుళం రోడ్‌(07611) రైలు: కాచిగూడలో ఈ నెల 10న సాయంత్రం 6.55 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.  
►శ్రీకాకుళం రోడ్‌–వికారాబాద్‌(07612) రైలు: శ్రీకాకుళం రోడ్‌లో ఈ నెల 11న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయత్రం 5.10కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.47కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 7.50గంటలకు వికారాబాద్‌ చేరుకుంటుంది.  
►వికారాబాద్‌–శ్రీకాకుళంరోడ్‌(07613) స్పెషల్‌:  వికారాబాద్‌లో ఈ నెల 12న సాయంత్రం 4 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 5.45కు దువ్వాడ చేరుతుంది. తిరిగి 5.47కు బయలుదేరి అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీకాకుళం రోడ్‌ చేరుకుంటుంది.  
►శ్రీకాకుళం రోడ్‌–కాచిగూడ(07614) స్పెషల్‌:  శ్రీకాకుళం రోడ్‌లో ఈ నెల 13న మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి అదే రోజు సాయంత్రం 5.20కు దువ్వాడ చేరుకుని, తిరిగి 5.22కు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5.50 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.  

రైళ్ల గమ్యం కుదింపు, దారి మళ్లింపు.. 
►వాల్తేర్‌ డివిజన్‌ కే–ఆర్‌ లైన్‌ కోరాపుట్‌–మనబర్, కోరాపుట్‌–దుమురిపుట్‌ సెక్షన్ల మధ్య జరుగుతున్న ట్రాక్‌ ఆధునికీకరణ, రెండో ట్రాక్‌ పనుల నిమిత్తం పలు రైళ్ల గమ్యం కుదిస్తున్నట్లు, మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నట్లు ఎ.కె.త్రిపాఠి తెలిపారు. 
►విశాఖపట్నం–కోరాపుట్‌(08546) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 5 నుంచి 10 వరకు లక్ష్మీపూర్‌ రోడ్‌ వరకు మాత్రమే నడుస్తుంది.  కోరాపుట్‌–విశాఖపట్నం(08545) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 6 నుంచి 11 వరకు లక్ష్మీపూర్‌ రోడ్‌ నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.  
►విశాఖపట్నం–కోరాపుట్‌(08512) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 6, 9 తేదీల్లో దమన్‌జోడి వరకు మాత్రమే నడుస్తుంది. కోరాపుట్‌–విశాఖపట్నం(08511) ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 7, 10 తేదీల్లో దమన్‌జోడి నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటుంది.  
►ఈ నెల 6న విశాఖలో బయలుదేరే విశాఖపట్నం–కిరండూల్‌(08551) పాసింజర్‌ స్పెషల్‌ అరకు వరకు మాత్రమే నడుస్తుంది.  
►ఈ నెల 6న కిరండూల్‌లో బయలుదేరే కిరండూల్‌–విశాఖపట్నం(08552) పాసింజర్‌ స్పెషల్‌ జయపూర్‌ వరకు మాత్రమే నడుస్తుంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)