Breaking News

కంటైనర్‌ను ఢీకొట్టిన కారు, అక్కడిక్కడే ఐదుగురు దుర్మరణం

Published on Thu, 12/04/2025 - 20:58

పల్నాడు, సాక్షి :  పల్నాడు జిల్లా చిలకలూరి పేటలో చిలకలూరిపేట బైపాస్ పై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.  ఈ ప్రమాదంలో ఐదు మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

ట్రాక్టర్ల లోడ్ తో వెళుతున్న కంటైనర్‌ను వెనుక నుంచి మారుతి షిప్ట్‌ కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో ఐదు మంది మృతి చెందారు. గుంటూరు నుంచి ఒంగోలు వైపు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

ఇటీవల  కర్నూలు జిల్లాలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో  ఇద్దరు చిన్నారులతో సహా ఐదుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఈ ఘటనలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డవారిని స్థానికి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. జిల్లాలోని ఎమ్మిగనూరు మండలం కోటేకల్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల కాలంలో తరచు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 

గత రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు, బస్సు ప్రమాదాలు తీవ్రంగా చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లాలో అక్టోబర్ 24న జరిగిన ప్రైవేట్ బస్సు ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. ఇదొక పెద్ద విషాదం. అదనంగా, రాష్ట్రవ్యాప్తంగా పలు రోడ్డు ప్రమాదాలు నమోదై, అనేక ప్రాణనష్టం జరిగింది.

గత నెలలో హైదరాబాద్‌–బెంగళూరు వెళ్తున్న లగ్జరీ ప్రైవేట్ బస్సు అగ్నికి ఆహుతి అయ్యింది.  ఈ ఘటనలో భారీ ప్రాణనష్టం జరిగింంది. బైక్‌ను ఢీకొట్టిన బస్సులో మంటలు వ్యాపించి క్షణాల్లో భారీ ప్రాణనష్టం వాటిల్లింది. 2025లో ఇప్పటివరకు): 15,462 రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి.  అత్యధిక శాతం ప్రమాదాలకు ఓవర్‌ స్పీడింగ్‌ ప్రధాన కారణంగా తెలుస్తోంది.  కార్లు, బస్సులు, బైక్‌లు నియంత్రణ కోల్పోవడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. 

ఇదీ చదవండి: ఇల్లు కట్టాలంటే రూ. 20 లక్షలు లంచం, టెకీ ఆత్మహత్య

Videos

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

నేను తాడిపత్రి పోతా.. ఏం పీకుతారో పీక్కోండి.. మాస్ వార్నింగ్

మరి గోరం... హీరోయిన్ ఎంగిలి చేసిన బాటిల్ ధర రూ.3 లక్షలు..!

అనంతపురం రూరల్ EX ZPTCపై పోలీసుల ఓవర్ యాక్షన్

జోగి రమేష్ హౌస్ అరెస్ట్

ఆ 15 స్థానాల్లో పోటీయే లేదు..! లైవ్ లో మొత్తం బయటపెట్టిన YS జగన్

Photos

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)

+5

సన్ ఫ్లవర్ తో రితికా నాయక్‌ (ఫొటోలు)