Breaking News

మార్గదర్శి అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధం 

Published on Thu, 04/27/2023 - 05:01

రాజమహేంద్రవరం సిటీ: మార్గదర్శి అక్రమాలపై చర్చించేందుకు టీడీపీ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి చేసిన సవాల్‌కు తా­ను సిద్ధమేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. తూర్పు­గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మార్గ­దర్శి అక్రమాలపై పోరాడుతుంటే.. టీడీపీ నేతలు మార్గ­దర్శి అక్రమాలను వెనకేసుకొస్తూ చర్చకు సవాల్‌ విసురు­తున్నారని చెప్పారు.

తాను బహిరంగ చర్చకు సిద్ధమేనని ప్రకటించారు. ఈ చర్చ రామోజీరావు సమక్షంలో రామోజీ ఫిల్మ్‌సిటీలో నిర్వహించాలని కోరారు. ఇందుకోసం చంద్రబాబు ద్వారా జీవీ రెడ్డి ప్రయత్నించాలని సూచించారు. తద్వారా దీనికి జాతీయ స్థాయిలో విలువ పెరుగుతుందని చెప్పారు. ఈ చర్చలో రామోజీ పాల్గొన్నా, పాల్గొనక­పోయి­నా ఫర్వాలేదన్నారు.

రామోజీ ఫిల్మ్‌ సిటీలో అవకాశం లేని పక్షంలో.. టీడీపీ ప్రధాన కార్యాల­యంలోనైనా ఏర్పాటు చేయాలన్నారు.  జనసేన కూడా మార్గదర్శికే అనుకూలంగా వ్యవహరిస్తోందని చెప్పారు. మే 14న మార్గదర్శి అక్రమా­లపై చర్చ జరిగే అవకాశం ఉందని చెప్పారు. 

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)