Breaking News

బురదజల్లడమే బాబు పని

Published on Sun, 09/29/2024 - 05:32

సాక్షి, అమరావతి: మతకల్లోలాలు సృష్టించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని తిరుమలకు వెళ్లకుండా అడ్డుకో­వాలని టీడీపీ భారీ కుట్ర చేసిందని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్‌ ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాల­యంలో శనివారం ఆయన మీడియాతో మాట్లా­డుతూ రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు బురద­జల్లడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి మాజీ సీఎం వైఎస్‌ జగన్‌కి అనుమతి లేదంటు­న్నారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకోటి ఉంటుందా! అని ప్రశ్నించారు. కల్తీ లడ్డూ ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు దాన్ని డైవర్ట్‌ చేయడానికి డిక్లరేషన్‌ అంశం తెరపైకి తెచ్చారని భరత్‌ మండిప­డ్డారు.

చంద్రబాబు హిందుత్వాన్ని, తిరుమలను తన రాజకీయ ప్రయోజనాలకు ఎలా వాడుకుంటున్నారో, ఏ రకంగా కుటిల రాజకీయాలు చేస్తున్నారో వైఎస్‌ జగన్‌ అద్భుతంగా వివరించారని చెప్పారు. చంద్ర­బాబు చేసిన అపచారం కారణంగా రాష్ట్ర ప్రజలకు నష్టం కాకూడదని రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో పూజలు నిర్వహించినట్టు చెప్పారు. లడ్డూలో వాడే నెయ్యి కల్తీ జరిగిందని ఆరోపించిన చంద్రబాబు ఆధారాలు చూపించడంలో విఫలమ­య్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీటీడీ ఈవో శ్యామ­ల­రావు, సీఎం చంద్రబాబు పరస్పర భిన్న­మైన స్టేట్‌మెంట్లు ఇచ్చి ప్రజల్ని, కోట్లాది మంది శ్రీవారి భక్తుల్ని అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు. మీడియాతో చంద్రబాబు చెప్పిన మాటల్లో డొల్లతనం కనపడిందన్నారు. నెయ్యిని వాడారని చెబుతున్న చంద్రబాబు.. ఎక్కడ వాడారన్నది మాత్రం అప్రస్తుతం అంటున్నారని, ఆ వాడిన నెయ్యిలో కల్తీ ఉందా అంటే.. ఆ తర్వాత వచ్చిన నెయ్యిలో ఉంది అంటున్నారని భరత్‌ చెప్పారు. 

చంద్రబాబు ఎలా హిందుత్వవాదో బీజేపీ చెప్పాలి
బూట్లు వేసుకుని పూజలు చేసే చంద్రబాబుకి హిందుత్వం పట్ల, హిందూ సంస్కృతి పట్ల అసలు నమ్మకం ఉందా.. అంటూ భరత్‌ ప్రశ్నించారు. హిందుత్వానికి టార్చ్‌ బేరర్స్‌ అని చెప్పుకునే బీజేపీకి ఇవన్నీ కనపడవా అని నిలదీశారు. తిరుమలలో శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన వెయ్యి కాళ్ల మండ­పాన్ని కూల్చివేయించిన చంద్రబాబు హిందుత్వవాది ఎలా అవుతారో బీజేపీ పెద్దలు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

లడ్డూ నాణ్యత పరీక్షల విషయంలో పదే పదే అబద్ధాలు చెబుతున్న చంద్రబాబుకి దశాబ్దాలుగా టీటీడీలో మూడు లేయర్ల టెస్టులు జరుగుతున్న విషయం కూడా తెలియకపోవడం బాధాకరమని అన్నారు. గతంలో ఏనాడూ నాణ్యత పరీక్ష కోసం బయటకు పంపలేదని చంద్రబాబు మరో పచ్చి అబద్ధం చెప్పారన్నారు. టీటీడీ వారు 2022లో బెంగళూరులోని ఐసీఏఆర్‌కి పరీక్షల కోసం పంపిన విషయం తెలుసుకోవాలన్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)