Breaking News

మాజీ ఎంపీ దరూర్‌ పుల్లయ్య కన్నుమూత

Published on Tue, 05/13/2025 - 08:51

వజ్రకరూరు/ ఉరవకొండ: వజ్రకరూరు మండలం ఛాయపురం గ్రామానికి చెందిన మాజీ పార్లమెంట్‌ సభ్యుడు దరూర్‌ పుల్లయ్య (93) కన్నుమూశారు. సోమవారం బళ్లారి సమీపంలోని కంప్లి వద్ద ఉన్న తన వ్యవసాయ క్షేత్రం నుంటి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో గుండెపోటుకు గురై ఆయన ప్రాణాలు విడిచారు. 

దరూర్‌ పుల్లయ్య 1932 జూన్‌ 20న ఛాయపురం గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించారు. ఈయనకు భార్య సత్యవతితో పాటు కుమారుడు దరూర్‌ రమేష్‌, ఆరుగురు కుమార్తెలు ఉన్నారు. మద్రాసులోని లా కళాశాలలో దరూర్‌ పుల్లయ్య బీఏ, బీఎల్‌ పూర్తి చేశారు. ఆ తరవాత రాజకీయాల్లోకి ప్రవేశించి 1969 నుంచి 1974 వరకు ఛాయపురం సర్పంచ్‌గా సేవలందించారు. 

ఆ తర్వాత ఉరవకొండ సమితి అధ్యక్షులుగా పనిచేశారు. 1962 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 1977, 1980 ఎన్నికల్లో ఎంపీగా ఎన్నికయ్యారు. 1976 నుంచి 1995 వరకు అనంతపురం ఏపీ లైటింగ్‌ ఎండీగా, కంప్లి షుగర్‌ ఫ్యాక్టరీ డైరెక్టర్‌గానూ పనిచేశారు. నీటి పారుదల రంగంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన దరూర్‌ పుల్లయ్య జిల్లాలో తాగు, సాగునీటి కల్పన కోసం కృషి చేశారు. పుల్లయ్య మృతితో ఆయన స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)