Breaking News

పోలీసుల నోటీసులను రద్దుచేయండి..

Published on Tue, 12/24/2024 - 05:07

సాక్షి, అమరావతి :రేషన్‌ బియ్యం కేసులో సాక్షు­లు­గా విచారణకు రావాలంటూ బందరు తాలుకా పోలీ­సులు తమకు జారీచేసిన నోటీసులను సవా­లుచేస్తూ మాజీమంత్రి, వైఎస్సార్‌సీపీ సీనియర్‌ నేత పేర్ని నాని, ఆయన కుమారుడు పేర్ని సాయి కృష్ణమూర్తి హైకోర్టును ఆశ్రయించారు.  నోటీసు­లను రద్దుచేయాలని కోరుతూ రిట్‌ పిటి­షన్‌ దాఖలు చేశారు.   అసలు తమను ఏ విధంగా సాక్షులుగా పరిగణిస్తున్నారో అర్థంకావడంలేదన్నారు. ఈ వ్యాజ్యంపై  మంగళవారం విచారణ జరగనుంది.  

మమ్మల్ని ఇరికించి అరెస్టుకు పోలీసుల యత్నం..
బందరులో పేర్ని నాని భార్య జయసుధ ఓ గౌడన్‌ నిర్మించి దానిని పౌర సరఫరాల శాఖకు అద్దె­కిచ్చారు. ఇందులో నిల్వచేసిన రేషన్‌ బియ్యంలో కొంత మాయమైనట్లు ఆరోపణలు రావడంతో ఆ­మెపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో విచారణ నిమిత్తం తమ ముందు హాజరుకావాలంటూ నోటీసులివ్వడంతో వాటిపై నాని, ఆయన కుమారుడు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. బియ్యం మాయం కేసులో త­మను అక్రమంగా ఇరికించి, అరెస్టుచేసేందుకు పోలీ­సులు  యత్నిç­Ü్తున్నారని  పిటి­షన్‌లో పేర్కొన్నారు. బి­య్యం మాయంతో తమ­కెలాంటి సంబంధంలేద­న్నారు. 

గోడౌన్‌ను పౌర సరఫరాల శాఖకు అద్దె­కిచ్చా­మని, అందులో ఉన్న బియ్యం మాయమైతే బాధ్యు­లైన అధికారులపై చర్యలు తీసుకోవాలిగానీ, అద్దెకి­చ్చిన యజమానిపై కేసు నమోదు చేయడం విడ్డూ­రంగా ఉందన్నారు. రాజకీయ కారణాలతోనే పోలీ­సులు ఈ కేసు నమోదు చేశారన్నారు.  తమ నుంచి ఎలాంటి సమాచారం కావాలో పోలీసులు  నోటీ­సుల్లో పేర్కొనలేదన్నారు. బియ్యం మాయంపై  కోటి­రెడ్డి అనే అధికారి ఫిర్యాదు ఇచ్చారని, దాని ఆధా­రంగా నమోదుచేసిన కేసులో విచారణకు రా­వా­­లని మాత్రమే నోటీసుల్లో పేర్కొన్నారని వారు తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)