Breaking News

ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు: అంబటి

Published on Mon, 06/15/2026 - 18:50

తాడేపల్లి: ఏపీలో జంగిల్ రాజ్ పాలన కొనసాగుతోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. ఏ నియంత పాలన కూడా ఇంతకంటే దారుణంగా లేదని చెప్పారు. ఎమ్మెల్యేలు రాజ్యాంగ వ్యతిరేక శక్తులుగా మారిపోయారని అన్నారు. సెటిల్మెంట్లు, మద్యం, ఇసుక.. అన్ని రకాల అక్రమాలు చేస్తున్నారని తెలిపారు.

‘‘రెడ్ బుక్ చేతిలో పెట్టుకుని హద్దులు మీరి ప్రవర్తిస్తున్నారు. ఏకంగా ఎమ్మెల్యేలే ఇళ్ల మీదకు వెళ్లి దాడులు చేస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ నేరుగా తమ నాయకుడి ఇంటిమీదకే వెళ్లి దాడి చేశాడు. విచిత్రం ఏంటంటే దాడి చేసిన ఎమ్మెల్యేని వదిలేసి, దాడికి గురైన ఈడ్పుగంటి శ్రీనివాసరావు మీద కేసు పెట్టారు’’ అని చెప్పారు.

అతని మీద 94 కేసులు 
మందేసి, చిందేసిన ఎమ్మెల్యే చింతమనేనికి పోలీసులు మద్దతు ఇవ్వటం ఏంటని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘‘దీన్ని జంగిల్ రాజ్ అనరా? చికెన్ మీద కూడా ట‍్యాక్సులు వేసి దోచుకునే దుస్థితికి టీడీపీ ఎమ్మెల్యేలు చేరారు. మా ఇంటి మీద దాడి చేసిన వారిని వదిలేసి నాపై కేసు పెట్టారు. రాష్ట్రంలో పోలీసుల పనితీరు ఇలా ఉంది. చింతమనేనిని అచ్చోసిన ఆంబోతులాగా రాష్ట్రం మీద వదిలేశారు. 

ఇప్పటికే అతని మీద 94 కేసులు ఉన్నాయి. అయినప్పటికీ చంద్రబాబు అతనిపై ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు? దీనికి కూటమి నేతలు సిగ్గుతో తల దించుకోవాలి. తమ దోపిడీకి ఎవరు అడ్డొస్తే వారిపై దాడి చేస్తున్నారు. లాకప్ డెత్ లు గతంలో విన్నాం. ఇప్పుడు ఆ శవాలను కూడా పోలీసులు దహనం చేసే పరిస్థితికి వచ్చింది. పోలీసులే రౌడీలుగా మారతారా? అసలు ఏపీని ఎక్కడకు తీసుకెళ్తున్నారు? హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు? 

మందేసి... చిందేసి ఏంటది..? చింతమనేని ఘటనపై అంబటి మాస్ రియాక్షన్

లింగమనేని రమేష్ ఫ్లైట్ టిక్కెట్లు కొనటంతో జనసేన నేతలంతా ఢిల్లీ వెళ్లారు. అక్కడకు వెళ్లి తెలంగాణ గురించి మాట్లాడటం ఏంటో? ఏపీలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ ఢిల్లీలో మీటింగులు ఎందుకు? పవన్ జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశం హాస్యాస్పదం. రిలీజ్ అయిన సినిమాని రీరిలీజ్ చేసినట్టుగా ఉంది. ఆల్రెడీ తెలంగాణలో పోటీ చేశారు కదా? ఇంకా జాతీయ రాజకీయాలు అంటుంటే నాకే సిగ్గుగా ఉంది. రాష్ట్రం కోసం త్యాగం చేశానంటున్న పవన్ రానున్న రోజుల్లో జనసేనని టీడీపీకి త్యాగం చేస్తారేమో?’’ అని నిలదీశారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)