Breaking News

కృష్ణా, గోదావరిలో కొనసాగుతున్న వరద

Published on Sat, 08/30/2025 - 03:04

సాక్షి, అమరావతి, విజయపురిసౌత్, పోలవరం రూరల్‌: వర్షాలు కొనసాగుతుండటంతో వరద ప్రవాహం నిలకడగా ఉంది. కృష్ణా నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 2,43,377 క్యూ­సెక్కులు చేరుతుండగా.. 2,38,626 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 197 టీఎంసీలను నిల్వ చేస్తున్నా­రు. నాగార్జునసాగర్‌లోకి 2,61,404 క్యూసెక్కులు చేరుతుండగా దిగువకు 2.43 లక్షల క్యూసెక్కులను వదిలేస్తున్నారు. సాగర్‌లో ప్ర­స్తుతం 305.75 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 

పులిచింతల ప్రాజెక్టులోకి 2,71,310 క్యూ­సెక్కులు చేరుతుండగా 39.55 టీఎంసీలను నిల్వ చేస్తూ 2,60,881 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 3,08,838 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు 11,938 క్యూసెక్కులను విడు­దల చేస్తూ మిగులుగా ఉన్న 2,96,900 క్యూ­సెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

గోదావరి నుంచి ధవళేశ్వరం బ్యారేజీలోకి 7,58,779 క్యూసెక్కులు చేరుతుండగా గోదా­వరి డెల్టాకు 6,200 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 7,52,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి వరద ప్రవాహం పెరుగుతుండటంతో పోలవరానికి క్రమేపీ వరద పెరుగుతోంది. దీంతో ప్రాజెక్టులో నీటి మట్టం 31.750 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి దిగువకు 8.07 లక్షల క్యూసెక్కులను అధికారులు దిగువకు వదిలేస్తున్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)