Breaking News

కృష్ణాలో పెరిగిన వరద

Published on Tue, 07/25/2023 - 05:18

సాక్షి, అమరావతి/హొళగుంద(కర్నూలు)/శ్రీశైలం ప్రాజెక్ట్‌: పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలో ఎగువన వరద ఉద్ధృతి పెరుగుతోంది. సోమ­వారం ఆల్మట్టి డ్యామ్‌లోకి 1,14,445 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 64.41 టీఎంసీలకు చేరుకుంది. దాంతో ఆల్మట్టి డ్యామ్‌ సగం నిండినట్లయింది. మరో 65 టీఎంసీలు చేరితే డ్యామ్‌ పూర్తిగా నిండిపోతుంది. మహారాష్ట్ర, కర్ణాటకలో సోమవారం విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో ఆల్మట్టిలోకి మంగళవారం వరద ఉద్ధృతి మరింత పెరగనుంది.

ప్రస్తుతం ఆల్మట్టిలో విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు వదు­లుతున్న జలాలకు.. స్థానికంగా కురిసిన వర్షాలు తోడవుతుండటంతో నారాయణపూర్‌ డ్యామ్‌­లోకి 13,675 క్యూసెక్కులు చేరుతున్నాయి. దాంతో ఆడ్యామ్‌లో నీటి నిల్వ 19.09 టీఎంసీలకు చేరుకుంది. డ్యామ్‌ నిండాలంటే ఇంకా 18 టీఎంసీలు అవసరం. ఇక జూరాల ప్రాజెక్టులోకి 26,244 క్యూసెక్కులు చేరుతుండగా.. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో విద్యుదుత్పత్తి చేస్తూ 33,235 క్యూసెక్కులను దిగువకు వదులు­తు­న్నారు. శ్రీశైలం డ్యామ్‌లోకి సోమవారం సాయంత్రం 6 గంటలకు 4,045 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 35.47 టీఎంసీలకు చేరుకుంది.

మూసీ ప్రవాహంతో నాగార్జునసాగర్‌కు దిగువన వరద స్థిరంగా కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 8,532 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 18.73 టీఎంసీలకు చేరుకుంది. మున్నేరు, వాగులు, వంకల నుంచి ప్రకాశం బ్యారేజ్‌లోకి 10,917 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 7,785 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 3,132 క్యూసెక్కులను అధికారులు సముద్రంలోకి వదిలేస్తున్నారు. 

తుంగభద్ర డ్యాంకు భారీగా వరద 
కృష్ణా నది ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ప్రవాహం జోరందుకుంది. తుంగభద్ర డ్యాంలో నీటి నిల్వ 30 టీఎంసీలను దాటింది. సోమవారం ఉదయం 64,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. నీటి చేరిక ఇలాగే ఉంటే నెలాఖరు నాటికి డ్యాం నిండి ఎల్‌ఎల్‌సీ కింద వరి సాగుకు అవకాశం కలుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

శివమొగ్గ, ఆగుంబే, వరనాడు, తీర్థనహళ్లి తదితర డ్యాంల ఎగువ ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తుండడంతో వరద నీరు చేరికపై వారు నమ్మకంగా ఉన్నారు. ప్రస్తుతం దిగువ కాలువకు తాగునీటి అవసరాలకు బోర్డు అధికారులు ఈ నెల 28 తర్వాత నీటిని విడుదల చేయనున్నారు. తుంగభద్ర డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టం 1,633 అడుగులు కాగా సోమవారం ఉదయం 1,602.84 అడుగులకు చేరుకుంది. అలాగే పూర్తి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా ప్రస్తుతం 30 టీఎంసీల నిల్వ ఉంది. 

24ఏఎల్‌ఆర్‌129: తుంగభద్ర రిజర్వాయర్‌లోకి చేరిన వరద నీరు

24ఎస్‌ఆర్‌ఐ 30ఏ – 812 అడుగులు వద్ద శ్రీశైలం డ్యాం నీటిమట్టం


  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)