Breaking News

వరద నష్టపరిహారంపై గందరగోళం

Published on Tue, 10/01/2024 - 04:03

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): విజయవాడ బుడమేరు వరద నష్టపరిహారంపై గందరగోళ పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. బాధితులకు వారి బ్యాంకు ఖాతాల్లో నష్టపరిహారాన్ని జమచేస్తామని ప్రకటించినప్పటికీ అలా కాకపోవడంతో వారు రోడ్డెక్కి లబోదిబోమంటున్నారు. ఇస్తామన్న కొద్దిపాటి పరిహా­రంలోనూ కోతలు, దానికితోడు సాంకేతిక కారణాలను చూపి నిలిపివేస్తున్నారని వారు మండిపడుతున్నారు. కేవైసీ కాలేదని.. నీ ఖాతా వాడుకలో లేదనే బ్యాంకు సిబ్బంది సమాధానాలతో వరద బాధితులకు దిక్కుతోచడంలేదు.

ప్రభుత్వం నష్టపరిహారాన్ని ఎగ్గొట్ట­డా­నికే ఈ విధమైన ఎత్తుగడలను అనుసరిస్తోందంటు­న్నారు. తమకు జరిగిన అన్యాయం.. రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని నిరసిస్తూ నగరంలోని పలు సచివాలయాల వద్ద వరద బాధితులు సోమవారం ధర్నాలు నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయానికి కూడా అనేకమంది తరలివెళ్లారు.

బ్యాంకుల్లో బారులుతీరిన బాధితులు.. నిజానికి.. వరద నష్టపరిహారాన్ని ఈనెల 30 నాటికి బాధితుల ఖాతాల్లో జమచేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. దీంతో బాధితులు బ్యాంకులకు పోటెత్తారు. అయితే, మీ ఖాతా వాడుకలో లేదని.. కేవైసీ చేయించుకోవాలని బ్యాంకు సిబ్బంది సూచించటంతో ఇళ్లకు వెళ్లి ఆధార్, పాన్‌కార్డుల జిరాక్స్‌లను తీసుకుని మళ్లీ వచ్చారు. ఆ తర్వాత క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ మళ్లీ ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) లింక్‌ అంటూ మెలికపెట్టారు. ప్రభుత్వ పథకాల నగదు బ్యాంకు ఖాతాల్లో పడాలంటే ఎన్‌పీసీఐతో ఖాతాలు లింక్‌ అయి ఉండాలని అధికారులు చెప్పడంతో బాధితులు అయోమయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే.. చాలా కుటుంబాల్లో నాలుగైదు ఏళ్ల క్రితం చనిపోయిన వారి ఖాతాల్లో నగదు జమకావడంతో వారేమి చేయాలో దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)