Breaking News

తీరికలేనప్పుడు ఎందుకొచ్చారు?

Published on Tue, 09/03/2024 - 06:59

(విజయవాడ వరద ప్రాంతం నుంచి ‘సాక్షి’ బృందం) ముంపు ప్రాంతాల పర్యటనలో భాగంగా కండ్రిక, రాజీవ్‌నగర్‌ కాలనీలను పరిశీలించేందుకు వచ్చిన మంత్రులు సంధ్యారాణి, వంగలపూడి అనితలకు స్థానికుల నుంచి చేదు అనుభవం ఎదురైంది. వారిని చూడగానే ముంపు బాధితులు ఒక్కసారిగా ఫైర్‌ అయ్యారు.  మూడ్రోజులుగా వరద నీటిలో అవస్థలు పడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని, కనీసం తాగునీరు, భోజన వసతులు కల్పించడంలో పూర్తి విఫలమయ్యారని మండిపడ్డారు. అనారోగ్యంతో ఉన్నవారిని సురక్షిత ప్రాంతానికి తరలించడానికి నానా అగచాట్లు పడుతున్నామని విరుచుకుపడ్డారు. రాజీవ్‌ నగర్, కండ్రిక, గుణదల వంద అడుగుల రోడ్డు, గుణదల ఫ్లిప్‌కార్ట్‌ గోదాము, బ్రిటానియా గోదాములతో పాటు గుణదల రోడ్డు వంటి ప్రాంతాల్లో సహాయక చర్యలులేక ఇబ్బందులు పడుతున్నామన్నారు.  

తీరికలేనప్పుడు రావడమెందుకు? 
మంత్రి సంధ్యారాణితో వచ్చిన ఆహార పొట్లాల వాహనాన్ని ఆమె చేతుల మీదుగా ఇప్పించేందుకు టీడీపీ శ్రేణులు యతి్నంచారు. అయితే, బాధితులు అప్పటికి భోజనంలేక మూడ్రోజులుగా ఇబ్బందులు పడుతుండటంతో ఆహార పొట్లాల వాహనం వద్దకు గుంపులుగా చేరుకున్నారు. దీంతో టీడీపీ వారు ఆహార పొట్లాలను గాలిలోకి ఎగరేయడంతో తీవ్ర విమర్శలపాలయ్యారు. ఇలా మంత్రులు కొద్దిదూరం ట్రాక్టర్‌పై వెళ్లి ఆ తర్వాత వెనుదిరిగారు. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)