Breaking News

సాగర్‌కు తగ్గిన వరద ఉధృతి

Published on Wed, 09/03/2025 - 04:34

విజయపురిసౌత్‌/సత్రశాల(రెంటచింతల)/గాంధీనగర్‌(విజయవాడసెంట్రల్‌): నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో మంగళవారం సాగర్‌లో 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. 18 క్రస్ట్‌గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 1,37,790 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 1,89,344 క్యూసెక్కులు వచ్చి చేరడంతో మొత్తం ఔట్‌ఫ్లోగా 1,89,344 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 5,156, ప్రధాన జలవిద్యుత్‌ కేంద్రానికి 33,698, ఎస్‌ఎల్‌బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌ జలాశయ నీటిమట్టం 585.80 అడుగులు కాగా ఇది 299.7430 టీఎంసీలకు సమానం. 

ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద 
కృష్ణానదికి ఎగువన ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద వస్తుండడంతో ప్రకాశం బ్యారేజ్‌ వద్ద వరద ఉధృతి స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారేజ్‌కు 3,52,772 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా ఇందులో 3,37,525 క్యూసెక్కుల వరద సముద్రంలోకి వదిలివేస్తున్నారు. మిగిలిన 15,247 క్యూసెక్కులు డెల్టాలోని పంట కాలువలకు వదిలారు.  

పులిచింతలకు 1,43,704 క్యూసెక్కులు విడుదల 
నాగార్జునసాగర్‌ టెయిల్‌పాండ్‌ విద్యుత్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 8 క్రస్ట్‌గేట్లు ద్వారా 1,43,704 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేసినట్లు ప్రాజెక్టు ఎస్‌ఈ వెంకటరమణ, ఈఈ సుబ్రమణ్యం మంగళవారం తెలిపారు. టెయిల్‌ పాండ్‌ ప్రాజెక్టు రిజర్వాయర్‌ 8 క్రస్ట్‌గేట్లు 3.50 మీటర్లు ఎత్తు ఎత్తి 1,43,704 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. నీటి మట్టం ప్రాజెక్టు 75.50 మీటర్లకు గాను 74.38 మీటర్లకు నీరు చేరుకుందన్నారు. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)