Breaking News

పచ్చనేత ఆక్రమణలపై పెల్లుబికిన ఆగ్రహం

Published on Sat, 06/21/2025 - 05:16

సాక్షి ప్రతినిధి, బాపట్ల:  చీరాల పచ్చనేత బుర్ల వెంకట్రావు ఆక్రమించి ధ్వంసం చేసిన ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ను తక్షణమే పునరుద్ధరించాలంటూ  తీర గ్రామాల మత్స్యకారులు శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.  ఉదయమే పాండురంగాపురం పరిధిలో ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సముద్రంలో కలిసే ప్రాంతానికి చేరుకున్నారు. ప్రధాన కాలువను పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే యంత్రాలతో తామే కాలువను పునరుద్ధరించుకుంటామని తేల్చి చెప్పారు. మత్స్యకారులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో టీడీపీ నేత బుర్ల అనుచరులు పోలీసులకు సమాచారమందించారు.

దీంతో బాపట్ల డీఎస్పీ రామాంజనేయులుతోపాటు, సిబ్బంది హుటాహుటిన తీరప్రాంతానికి చేరుకున్నారు. పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మత్స్యకారులు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగారు. తక్షణమే టీడీపీ నేత బుర్ల వెంకట్రావు ధ్వంసం చేసి ఆక్రమించిన స్ట్రెయిట్‌కట్‌ను, ప్రధానంగా సీ మౌత్‌ను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేశారు. కాలువలో ఉన్న వెయ్యికి పైగా పడవలు వేటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందని, దీనివల్ల తాము ఉపాధి కోల్పోతున్నామని వాపోయారు. అందుకు కారణమైన వెంకట్రావును అరెస్ట్‌ చేయాలని నినాదాలు చేశారు. సముద్ర తీరంలో ఆక్రమిత భూములకు డీకేటీ పట్టాలిచి్చన రెవెన్యూ అధికారులపైనా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 

స్పందించిన కలెక్టర్‌.. 
మత్స్యకారులు ఆందోళన తీవ్రతరం చేయడంతో బాపట్ల జిల్లా కలెక్టర్‌ వెంకట మురళి స్పందించారు. తీరం ఆక్రమణలపై బాపట్ల ఆర్డీవో గ్లోరియా, చీరాల ఆర్డీవో చంద్రశేఖరనాయుడుతో విచారణ కమిటీని నియమించారు. వెంటనే నివేదిక సమరి్పంచాలన్నారు. అంతవరకూ వివాదాస్పద భూమిగా ఉన్న సర్వేనంబర్‌ 499–1, 2లోని 1.50 ఎకరాల్లో ఎవరూ దిగవద్దని ఆదేశాలు జారీ చేశారు. విచారణ నివేదిక వచ్చాక సదరు భూమిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో మత్స్యకారులు శాంతించి ఆందోళనను విరమించారు. 

మత్స్యకారులపై కేసులు? 
తీరంలో ఆక్రమణలను అడ్డుకుంటున్న మత్స్యకారులపై టీడీపీ నేత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది. తమ ట్రాక్టర్లు, ఇతర యంత్రాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొనడంతో 20మందికి పైగా మత్స్యకారులపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు సమాచారం. 

వెంకట్రావుపై మత్స్యకారుల ఫిర్యాదు.. 
ఈపూరుపాలెం స్ట్రెయిట్‌ కట్‌ సీ మౌత్‌ పూడ్చివేసి 12 వేల కుటుంబాల మత్స్యకారుల కడుపు కొట్టిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి బుర్ల వెంకట్రావుపై కేసు నమోదు చేసి, చర్యలు తీసుకోవాలంటూ మత్స్యకారుడు కనకారావు శుక్రవారం బాపట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలువలను ధ్వంసం చేస్తున్న అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేయగా.. తమను దూషించి, చంపేస్తామంటూ బెదిరించారని ఆయన పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

పాండురంగాపురం సముద్ర తీరం వద్ద మత్స్యకారుల ఆందోళన 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)