2025–26లో పథకాల వారీగా రాష్ట్రానికి వచ్చే నిధులపై ఆర్థిక శాఖ అంచనా

Published on Sat, 02/15/2025 - 05:32

సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వం నుంచి 2025–26 ఆర్థిక సంవత్సరంలో కేంద్ర పథకాలు, కేంద్ర ప్రాయోజిత పథకాలు, ఉప పథకాలకు, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రావాల్సిన గ్రాంట్లు కలిపి రాష్ట్రానికి రూ.38,788 కోట్లు నిధులు వస్తాయని ఆర్థిక శాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నిధుల్లో కేవలం నాలుగు శాఖలకే 81శాతం మేర వస్తాయని తేల్చారు. కేంద్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఆయా పథకాలకు కేటాయించిన నిధుల ఆధారంగా మన రాష్ట్రానికి ఎంత వస్తాయనేది అంచనా వేసినట్లు ఆర్థిక శాఖ తెలిపింది. 

ముఖ్యంగా ఆయా పథకాల కోసం గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మన రాష్ట్రానికి చేసిన కేటాయింపులను దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాలు రూపొందించినట్లు పేర్కొంది. కేంద్ర బడ్జెట్‌లో వివిధ పథకాలకు రూ.5,20,61 కోట్లు కేటాయించగా, వాటిలో ఆంధ్రప్రదేశ్‌కు రూ.38,788 కోట్లు వస్తాయని రాష్ట్ర ఆర్థిక శాఖ అంచనా వేసింది. 

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 2025–26 ఆర్థిక సంవత్సరానికి రూ.13,750 కోట్లకు ప్రతిపాదనలు కేంద్రానికి పంపింది. అయితే గత రెండేళ్ల కేటాయింపులను పరిశీలిస్తే రాష్ట్రం నుంచి పంపిన ప్రతిపాదనల్లో సగం కన్నా తక్కువగా రూ.6,078 కోట్ల వరకు రావొచ్చని అధికారులు అంచనా వేశారు. 

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)