Breaking News

ఏడాది కిందటి పోస్టులపై ఇప్పుడు మనోభావాలు దెబ్బతినడం ఏమిటో!

Published on Mon, 12/02/2024 - 03:38

సాక్షి, అమరావతి: ‘నేను ఏడాది కిందట సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై ఇప్పుడు కొందరి మనోభావాలు హఠాత్తుగా దెబ్బతినడం ఏమిటో అర్థం కావడం లేదు. పత్రికల్లో ప్రచురించే కార్టూన్ల మాది­రిగానే నేను కూడా కొన్ని పోస్టులను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశా. పత్రికలకు ఉన్నట్టే వ్యక్తులకు కూడా కాస్త భావప్రకటన స్వేచ్ఛ ఉంది. కాస్త వ్యంగ్యంగా వ్యాఖ్యానించవచ్చు. ఆ పోస్టులు పెట్టినప్పుడు.. అంటే ఏడాది కిందట ఎవరూ తమ మనోభావాలు దెబ్బతిన్నాయని అనలేదు. పోలీసులకు ఫిర్యాదు చేయనూ లేదు. ఆ పోస్టుల్లో నేను పేర్కొన్నవారు కూడా కనీసం అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేయనేలేదు.

కానీ హఠాత్తుగా ఏడాది తరువాత.. అదీ ఆంధ్రప్రదేశ్‌లోని వేర్వేరు ప్రాంతా­ల్లోని వ్యక్తులకు ఒకేసారి మనోభావాలు దెబ్బతినడం ఏమిటో..! వాళ్లు ఒకేసారి వేర్వేరు పోలీస్‌స్టేషన్లలో ఫిర్యాదు చేయడం ఏమిటో..! పోలీసులు వెంటనే కేసులు పెట్ట­డం ఏమిటో..! దీన్నిబట్టి ఈ ఫిర్యాదులు, కేసుల వెనుక ఏం జరిగిందన్నదీ.. ఎంత పక్కా స్క్రిప్ట్‌ ఉందన్నదీ స్పష్టం అవుతునే ఉంది..’ అని సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ అన్నా­రు. ఆయన ఆదివారం వివిధ టీవీ చానళ్ల డిబేట్లలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు