Breaking News

అమానుషం.. కన్న కూతురిపై తండ్రి అఘాయిత్యం

Published on Sun, 12/14/2025 - 13:25

ఉప్పలగుప్తం: కన్న కూతురి చేయి పట్టుకుని విద్యాబుద్ధులు నేర్పించాల్సిన తండ్రి.. ఆమె పైనే కన్ను వేసి, అఘాయిత్యానికి పాల్పడిన అమానుష సంఘటన ఉప్పలగుప్తం మండలం కూనవరం గ్రామంలో జరిగింది. ఎస్సై సీహెచ్‌ రాజేష్‌ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఆ వ్యక్తి తన భార్యను ఉపాధి నిమిత్తం కువైట్‌ పంపించి, 15 ఏళ్ల కుమార్తెతో కలసి ఉంటున్నాడు. కుమారుడిని తన అత్తవారింటి వద్ద ఉంచాడు. ఇంట్లో ఎవ్వరూ లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న ఆ దుర్మార్గుడు కొంత కాలంగా తన కుమార్తెను బెదిరించి లైంగిక వాంఛ తీర్చుకుంటున్నాడు. 

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు అమ్మమ్మ గారింటి దగ్గర ఉంటున్న బాలిక సోదరుడికి సమాచారం ఇచ్చారు. తన తండ్రి అఘాయిత్యంపై అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మహిళా పోలీసు విచారణ అనంతరం బాధిత బాలిక సోదరుడి ఫిర్యాదు మేరకు డీఎస్పీ టీఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఆధ్వర్యాన కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాజేష్‌ తెలిపారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ ప్రసాద్, అమలాపురం రూరల్‌ సీఐ డి.ప్రశాంత్‌ కుమార్, ఎస్సై రాజేష్‌ పరిశీలించారు. బాధిత బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)