గత ప్రభుత్వంలోనే రైతులకు మేలు

Published on Wed, 11/27/2024 - 05:33

కంకిపాడు: ‘వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే రైతులకు మేలు జరిగింది. 75 కిలోల బస్తా రూ.1,600 ఉంటే రైతుకి రూ.1,550 వరకు గిట్టుబాటు అయ్యింది. ఇప్పుడు 75 కిలోల బస్తా రూ.1,720 ఉన్నా రైతుకి రూ.1,420కి మించి దక్కడం లేదు. గత ప్రభుత్వంలో 25 నుంచి 27 తేమ శాతం ఉన్నా రైతు భరోసా కేంద్రాల ద్వారా కొన్నారు. తుపాను భయంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నాం. ఈ పరిస్థితిలో మేముంటే 22 శాతం లోపు తేమ ఉంటేనే కొంటామని ప్రభుత్వం చెప్పడం దారుణం. 1,262 విత్తనం ధాన్యాన్ని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా అమ్ముకున్నాం. 

ఇప్పుడు మాత్రం నూక అవుతుందని అధికారులు సాకు చెబుతున్నారు. ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. మా పరిస్థితి ఏమిటి’ అని రైతులు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్‌ను నిలదీశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, అధికారులు తమను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం సమస్య అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేయలేదన్నారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పునాదిపాడు, కోలవెన్ను, దావులూరుల్లో మంగళవారం మంత్రి మనోహర్‌ పర్యటించారు. కల్లాలు, రోడ్లపై ఆరబోసిన ధాన్యం రాశులు, సిద్ధంగా ఉంచిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. 

పంట అమ్మకంలో ఎదుర్కొ­ంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంచులు, రవా­ణా వాహనాలు లేక ఎక్కడి ధాన్యం అక్కడే ఉంటుందని రైతులు వాపోయారు. కోలవెన్నులో మనోహర్‌ను రైతులు, కౌలు రైతులు చుట్టుముట్టారు. నాలుగు రోజులుగా ధాన్యం రాశులుగా పోసి ఉంచామని, తుపాను భయంతో కంటి మీద కును­కు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. సంచులు, లారీలు కావాలని రైతు సేవా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నామని.. రైతుగా పుట్టడమే తమ దౌర్భాగ్యం అంటూ ఆవేదన వెలిబుచ్చారు. 

రైతులకు నచ్చజెప్పిన మంత్రి మనోహర్‌ 48 గంటల్లో కల్లాలు, రోడ్లపైన పోసి ఉన్న ధాన్యాన్ని వేగంగా రైతులు కోరుకున్న మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. సంచులు, లారీలు సమకూర్చాలని సూచించారు. జీపీఎస్‌తో సంబంధం లేకుండా ప్రైవేటు వాహనాలను అందుబాటులోకి తెచ్చి సమస్య పరి­ష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించామని, రూ.1,100 కోట్లు రైతులకు అందించామన్నారు.  

Videos

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

Photos

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)